calender_icon.png 24 October, 2025 | 1:09 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పాముకాటుతో ఆశ కార్యకర్త మృతి

24-10-2025 10:56:07 AM

బెజ్జూర్, (విజయక్రాంతి): కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూరు మండలం లోని ఇప్పలగూడ గ్రామానికి చెందిన ఆశా కార్యకర్త కనక కమల (45) పాముకాటుతో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఇంటి పేరడీలో పనులు చేస్తుండగా పాము కాటు వేసినట్లు తెలిపారు. చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తీసుకు వెళుతున్న క్రమంలో మార్గం మధ్యలో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.