05-10-2025 12:49:35 AM
-ప్రాణాలు కాపాడే ఆసుపత్రులతో రాజకీయాలు వద్దు
-మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు
-కొత్తపేటలో టిమ్స్ నిర్మాణ పనుల పరిశీలన
హైదరాబాద్, అక్టోబర్ 4 (విజయక్రాంతి)/ఎల్బీనగర్: రాజకీయాల కోసం ఆసుప త్రుల నిర్మాణాలు ఆపడం దుర్మార్గమని, వందేళ్ల ముందు చూపు కేసీఆర్‌ది అయితే, మంద బుద్ధి కాంగ్రెస్ పార్టీదని మాజీ మం త్రి హరీశ్‌రావు విమర్శించారు. కేసీఆర్ కరో నా తర్వాత ఎంతో ముందు చూపుతో హైదరాబాద్ చుట్టూ నలువైపులా నాలుగు టిమ్స్ ఆసుపత్రుల నిర్మాణంతోపాటు నిమ్స్ రెం డు వేల పడకల ఆసుపత్రికి, వరంగల్ హెల్త్‌సిటీకి శంకుస్థాపన చేశారని గుర్తు చేశారు.
వాటిని పూర్తి చేస్తే కేసీఆర్‌కు పేరొస్తుందని దురుద్దేశంతో సీఎం రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో పనుల్లో జాప్యం జరుగుతోందని మండిపడ్డారు. శనివారం ఎల్బీనగర్‌లో టిమ్స్ ఆస్పత్రి నిర్మాణ పనులను హరీశ్‌రావు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సూప ర్ స్పెషాలిటీ వైద్యం ప్రజలకు చేరువ చేసేలా నాలుగు టిమ్స్ ఆసుపత్రులు, వరంగల్ హెల్త్ సిటీ పనులను తమ ప్రభుత్వంలోనే సీఎం కేసీఆర్ ప్రారంభించారని, అన్ని నిధులు కేటాయించి పనులు దాదాపుగా పూర్తి చేశారని తెలిపారు.
కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం లోకి వచ్చాక పనులు ముందుకు పోవడం లేదని విమర్శించారు. సెల్లార్‌తో కలుపుకొని 6 అంతస్తుల భవనం ఎల్బీ నగర్ టిమ్స్ పనులను బీఆర్‌ఎస్ పూర్తి చేస్తే, రెండేళ్లలో 5 అంతస్తులు మాత్రమే పూర్తి చేశారని చెప్పా రు. తాము రంగారెడ్డి జిల్లాకు మెడికల్ కాలేజీకి అనుమతిస్తే దాన్ని రద్దు చేశారని, శంకు స్థాపన చేసిన కాలేజీని రద్దు చేసి, టిమ్స్ ఎల్బీ నగర్‌లో విలీనం చేశారని విమర్శించారు. కాంగ్రెస్ నాయకుల తప్పుడు చర్యల వల్ల ప్రజలకు తీవ్ర నష్టం జరుగుతోందన్నారు.
వరంగల్ హెల్త్ సిటీ, హైదరాబాద్ టిమ్స్ ఆసుపత్రులను యుద్ధ ప్రాతిపాదికన పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. రేవంత్‌రెడ్డి పుణ్యమా అని బస్తీ దవాఖానలో పని చేసే డాక్టర్లు, స్టాఫ్ నర్సులు, ఉద్యోగులకు ఆరు నెలల నుంచి జీతాలు లేవని విమర్శించారు. కాంగ్రెస్ పాలనలో రూ.1,400 కోట్ల బకాయి ఉండటంతో ప్రభుత్వ ఆస్పత్రుల్లో పేదలకు వైద్యం అందటం లేదని, ఇప్పటికైనా బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
రాజకీయాలు పక్కనబెట్టి కేసీఆర్ ప్రారంభించిన కంటి వెలుగు పథకాన్ని వెంటనే కొనసాగించాలని సూచించా రు. టిమ్స్ ఆసుపత్రులను యథావిధిగా 1000 పడకలుగా కొనసాగించాలని, మహేశ్వరం, కుత్బుల్లాపూర్ లలో మెడికల్ కాలేజీ లు కొనసాగించాలని డిమాండ్ చేశారు. హరీష్‌రావు వెంట మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, స్థానిక ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు వివేకానంద, కాలేరు వెంకటేష్, ఎమ్మెల్సీ యాదవరెడ్డి ఉన్నారు.