calender_icon.png 5 October, 2025 | 2:17 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

7న పాలస్తీనా సంఘీభావ ప్రదర్శనను జయప్రదం చేయండి

05-10-2025 12:48:20 AM

-పాలస్తీనా సంఘీభావ కమిటీ

ముషీరాబాద్, అక్టోబర్ 4 (విజయక్రాంతి): వామపక్షాలు, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ఆక్టోబర్ 7న హైదరాబాద్ లో నిర్వహించే పాలస్తీనా సంఘీభావ ప్రదర్శన ను జయప్రదం చేయాలనీ పాలస్తీనా సంఘీభావ కమిటీ పిలుపునిచ్చింది. హైదరాబాద్  హిమాయత్ నగర్  సత్యనారాయణరెడ్డి భవన్ లో శనివారం పాలస్తీనా సంఘీభావ కమిటీ సమావేశమైంది.

ఈ సమావేశంలో వామపక్ష ప్రజాసంఘాల నేతలు  పాలస్తీనా సంఘీభావ కమిటీ నాయకులు స్టాలిన్, మహేందర్, హన్మేష్, ఝాన్సీ, తేజ, తుడుం అనిల్ కుమార్, కర్ర దానయ్య, విజయ్, పర్వినా ఖలీద్, కృష్ణ, మునీర్ పటేల్, ఛాయాదేవి, వి. సంధ్య, అనసూయ, అరుణ, అనురాధ, సరళ, శ్రీకాంత్, జావిద్, మహేశ్, అఫ్సర్, తదితరులు పాల్గొని పాలస్తీనా సంఘీభావ ప్రదర్శన వాల్ పోస్టర్ ను విడుదల చేసారు.

ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ఆకాశం బాంబుల నుండి అగ్ని వర్షాన్ని కురిపిస్తూ, నరరక్త జీవనదిని చూస్తూ వికటాట్టహాసం చేస్తున్న వికృత విన్యాస నరహంతకులు బెంజిమోన్ నెతన్యాహూ, డోనాల్ ట్రంప్ అని మండి పడ్డారు. అక్టోబర్ 7న హైదరాబాద్ నగరం లో వామపక్షాలు, ప్రజా సంఘాల ఆధ్వర్యలో భారీ స్థాయిలో పాలస్తీనా ప్రజలకు సంఘీభావాన్ని ప్రకటించాలని నిర్ణయించామని, సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుండి ఇందిరా పార్క్ దాకా ప్రదర్శనను జరుగుతుందని, ప్రజలందరూ పాల్గొని విజయవం తం చేయాలని వారు కోరారు.