17-09-2025 07:39:53 PM
ఏరియా జిఎం రాధాకృష్ణ..
మందమర్రి (విజయక్రాంతి): ఏరియాలోని కార్మిక కాలనీలలో కార్మిక కుటుంబాల సభ్యులు తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని చెత్తాచెదారం లేకుండా చూడాలని ఏరియా సింగరేణి జనరల్ మేనేజర్ ఎన్ రాధాకృష్ణ అన్నారు. స్వచ్ఛభారత్ మిషన్లో భాగంగా స్వచ్ఛతాహి సేవ కార్యక్రమాన్ని జిఎం కార్యాలయం ఆవరణలో బుధవారం ప్రారంభించి మాట్లాడారు. కార్యాలయంలో గల అవసరం లేని వ్యర్థాలను తొలగించి ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు తమ వంతు పాత్రను పోషించాలన్నారు. మహాత్మగాంధీజీ పరిశుభ్రమైన, అభివృద్ధి చెందిన దేశం కావాలని ఆయన సంకల్పించారని దీనిని స్ఫూర్తిగా తీసుకుని స్వచ్చ తెలంగాణాను సాధించి తద్వారా స్వచ్ఛభారత్ ను సాధించే లక్ష్యంతో ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరారు.
అనంతరం యాపల్ పోస్ట్ ఆఫీస్ నుండి సివిల్ కార్యాలయం వరకు రహదారి వెంట ఉన్న పిచ్చి మొక్కలను తొలగించారు. అంతకు ముందు కార్యాలయం అధికారులు ఉద్యోగులతో పరిశుభ్రంగా ఉండటంతో పాటు పరిసరాల పరిశుభ్రత కోసం కొంత సమయం కేటాయిస్తానని ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఓటు జిఎం విజయప్రసాద్, ఏఐటియుసి బ్రాంచ్ సెక్రటరీ సలేంద్ర సత్యనారాయణ, సీఎంఓఏఐ అధ్యక్షులు రమేష్, పర్సనల్ మేనేజర్ ఎస్ శ్యాంసుందర్, ఎన్విరాన్ మెంటల్ అధికారి వెంకటరెడ్డి, డీజీఎం ఆర్విఎస్ఆర్కే ప్రసాద్, ఎంవీటిసి మేనేజర్ శంకర్, సీనియర్ పర్సనల్ ఆఫీసర్ శంకర్, ఏఐటియుసి పిట్ సెక్రటరీ గీతిక, జిఎం కార్యాల య ఉన్నతాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.