30-12-2025 12:00:00 AM
2026 ఆర్థిక సంవత్సర ప్రతిపాదనలకు స్టాండింగ్ కమిటీ ఆమోదం
గత ఏడాదితో పోలిస్తే రూ.745 కోట్ల పెంపు
మేయర్ గద్వాల విజయలక్ష్మి అధ్యక్షతన కీలక నిర్ణయాలు
హైదరాబాద్ సిటీ బ్యూరో, డిసెంబర్ 29 (విజయక్రాంతి): గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ 2026 ఆర్థిక సంవ త్సరానికిగానూ రూ.11,460కోట్లతో రూపొందించిన భారీ వార్షిక బడ్జెట్ ప్రతిపాదనలకు స్టాండింగ్ కమిటీ ఆమోదం తెలిపింది. సోమవారం జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయం లోని కమాండ్ కంట్రోల్ రూంలో మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధ్యక్షతన స్టాండింగ్ కమిటీ ప్రత్యేక సమావేశం, అలాగే 10వ సాధారణ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కమిషనర్ ఆర్‌వి కర్ణన్, ఇతర సభ్యులు పాల్గొన్నారు.
బడ్జెట్‌తో పాటు మొ త్తం 22 అంశాలపై 15 ఎజెండా, 7 అడిషనల్ చర్చించి ఆమోదముద్ర వేశారు. విలీన పురపాలికలతో కలుపుకొని 2026 ఆర్థిక సం వత్సరానికి రూ.11,460 కోట్ల అంచనాలతో రూపొందించిన డ్రాఫ్ట్ బడ్జెట్‌ను కమిటీ ఆమోదించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2025 సవరించిన బడ్జెట్ ప్రతిపాదనలకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. త్వరలో జరగబోయే కౌన్సిల్ సమావేశంలో ఈ బడ్జెట్‌ను తుది ఆమోదం కోసం ప్రవేశపెట్టను న్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం బడ్జెట్ రూ.10,714.73 కోట్లు కాగా వచ్చే ఏడాదికి దీనిని సుమారు రూ.745.27 కోట్లు పెంచా రు. ఈసారి రెవెన్యూ ఆదాయాన్ని ఏకంగా రూ. 6,441 కోట్లుగా అంచనా వేశారు.
అభివృద్ధి పనులకు- ఆస్తుల సేకరణ
ట్రాఫిక్ కష్టాలు తీర్చేందుకు మియాపూర్ ఎక్స్‌రోడ్డు నుంచి ఆల్విన్ ఎక్స్‌రోడ్డు వరకు 45, 60 మీటర్ల వెడల్పుతో ఫ్లైఓవర్, గ్రేడ్ సెపరేటర్లు, అండర్ పాస్‌ల నిర్మాణానికి 220 ఆస్తులను సేకరించేందుకు ప్రభుత్వానికి సిఫార్సు చేశారు. చందానగర్ ఎన్‌హెచ్ 9 నుంచి అమీన్‌పుర్ వరకు 45 మీటర్ల రోడ్డు, ఎన్‌హెచ్ 9 నుంచి సెయింట్ ఆర్నాల్ హైస్కూల్ వరకు 30 మీటర్ల రోడ్డు విస్తరణకు 124 ఆస్తుల సేకరణకు ఆమోదం తెలిపారు. ఇలా పలు అభివృద్ధి పనులకు ఆమోదం తెలిపారు.
జీహెచ్‌ఎంసీ వ్బుసైట్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాట్‌బాట్, ఆటోమేటెడ్ ఫారమ్ ఫిల్లింగ్ సేవలను అందుబాటులోకి తేనున్నారు. దీని నిర్వహణకు టెండర్లు పిలిచేందుకు అనుమతి ఇచ్చారు. 2025 ప్యానెల్ ఇయర్‌కు సంబంధించి ఖాళీగా ఉన్న సీనియర్ అసిస్టెంట్లు, సమాన హోదా కలిగిన పోస్టుల భర్తీకి కమిటీ ఓకే చెప్పింది. సమావేశంలో స్టాండింగ్ కమిటీ సభ్యులు బొంతు శ్రీదేవి, బానోతు సుజాత, సయ్యద్ మిన్హాజుద్దీన్, అబ్దుల్ వాహెబ్, మహమ్మద్ బాబా ఫసియుద్దీన్, వి.జగదీశ్వర్‌గౌడ్‌పాల్గొన్నారు.