30-12-2025 12:00:00 AM
కేసముద్రం, డిసెంబర్ 29 (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం క్యాంపు తండా శివారు వనాలకుంట తండాలో గ్రామస్తులకు శుద్ధిచేసిన త్రాగునీరు అందించడానికి మహబూబాబాద్ ఎంపీ పోరిక బలరాం నాయక్ ఐదు లక్షల రూపాయలు మంజూరు చేసి వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయించారు. తండావాసులకు సురక్షిత తాగునీరు లభించక, పలువురు కిడ్నీ సంబంధమైన జబ్బులకు గురికావడంతో ఎంపీ దృష్టికి తీసుకెళ్లగా స్పందించి 5 లక్షల రూపాయలు మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు కోసం మంజూరు చేశారని నారాయణపురం మాజీ ఎంపీటీసీ ధరావత్ రవి పేర్కొన్నారు.
ఈ మేరకు క్యాంపు తండా సర్పంచ్ ధరావత్ కైక నూతనంగా ఏర్పాటు చేసిన వాటర్ ప్లాంట్ ను సోమవారం ప్రారంభించారు. అనంతరం ఎంపీ చిత్రపటానికి పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ శేఖర్, వార్డు సభ్యులు సరిత, లాలు, భాస్కర్, అనూష, సునీత, అరుణ,గ్రామస్తులు పాల్గొన్నారు.