calender_icon.png 3 August, 2025 | 12:30 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పురోహితులకు కీలక ఆదేశాలు జారీ

03-08-2025 12:33:45 AM

- ప్రభుత్వ అనుమతి లేనిదే ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం నిషేధం

- మంత్రి కొండా సురేఖ

హైదరాబాద్, ఆగస్టు 2 (విజయక్రాంతి): రాష్ట్రవ్యాప్తంగా దేవాదాయ శాఖలో విధులు నిర్వర్తిస్తున్న పురోహితులు, అర్చకులకు, వేద పండితులకు ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ అనుమతి లేకుండా దేశ, విదేశాలు, అంతర్ రాష్ట్రాల్లో ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనకూడదని స్పష్టం చేస్తూ... ఉత్తర్వులు జారీ చేసింది. స్వామి వార్ల పేరు ప్రతిష్టలు విశ్వవ్యాప్తం చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నదని, అధికారిక కార్యక్రమాల్లో మాత్రమే అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది పాల్గొనాలని మంత్రి కొండా సురేఖ ప్రకటనలో తెలిపారు.