calender_icon.png 21 December, 2025 | 6:27 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాకే ఖానాపూర్ అభివృద్ధి

21-12-2025 05:06:31 PM

మాజీ మున్సిపల్ చైర్మన్ రాజురా సత్యం

ఖానాపూర్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లా ఖానాపూర్ మున్సిపాలిటీ గతంలో బి ఆర్ ఎస్ పాలనలో అభివృద్ధి అడ్రస్ లేకపోవడం వల్ల ఖానాపూర్ లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక అద్భుతమైన అభివృద్ధి చేసి చూపించామని ఖానాపూర్ మాజీ మున్సిపాలిటీ చైర్మన్ రాజుర సత్యం దుయ్యబట్టారు. ఈ మేరకు ఆదివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఖానాపూర్ పట్టణానికి బీఆర్ఎస్, బిజెపి, పార్టీలు చేసిందేమీ లేదని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేపట్టాక ఖానాపూర్ ఎమ్మెల్యే అహర్నిశలు కృషిచేసి ఖానాపూర్ పట్టణం అభివృద్ధికి బాటలు వేశారని దాన్ని చూసి ఓర్వలేకనే కొందరు నాయకులు ఆరోపణలు చేస్తున్నారు.

పట్టణంలో రూ.5 కోట్లతో అభివృద్ధి పనులు కనిపించడం లేదా..? అని ప్రశ్నించారు. పట్టణ ప్రజల ఇబ్బందుల మేరకు కోతులను పట్టించి ,తాగునీటి సమస్య, మురికి కాలువల సమస్య, తీర్చి ప్రధాన రోడ్డు సమస్య తీర్చేందుకు పనులు ప్రారంభించామని, పనులు చేసే కాంట్రాక్టర్లను ప్రతిపక్ష నాయకులు బెదిరించడం సరికాదని గతంలో కేసీఆర్ కేటీఆర్ ఇచ్చిన 25 కోట్ల రూపాయలు ఏమైనావని ప్రశ్నించారు.

జిల్లాలో బిజెపి ఎంపీ, ఎమ్మెల్సీలకు ఖానాపూర్ మున్సిపాలిటీ అనేది ఉందని తెలుసా?. అభివృద్ధి చేయడానికి మనసు కావడం లేదా? అని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో ఆత్మ కమిటీ చైర్మన్ తోట సత్యం, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ అబ్దుల్ మజీద్, పార్టీ పట్టణ అధ్యక్షులు నిమ్మల రమేష్, నాయకులు కురుమ శ్రీనివాస్, అమానుల్లా ఖాన్, జన్నారపు శంకర్, పరిమి సురేష్, దేవతి రాజేష్, శేషాద్రి, శ్రీనివాస్, తదితరులు ఉన్నారు.