calender_icon.png 5 May, 2025 | 1:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలి

04-05-2025 07:35:05 PM

సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కలవేన శంకర్..

మందమర్రి (విజయక్రాంతి): ఆపరేషన్ కగార్ పేరుతో కేంద్ర ప్రభుత్వం మావోయిస్టులను ఎరివేయడం మానుకొని మావోయిస్టులతో శాంతి చర్చలు జరిపి శాంతి భద్రతలు పరిరక్షణకు కృషి చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కలవేన శంకర్ డిమాండ్ చేశారు. పట్టణంలోని సిఈఆర్ క్లబ్ లో ఆదివారం నిర్వహించిన సిపిఐ జిల్లా సమితి సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. శాంతి చర్చలకు సిద్ధం అని మావోయిస్టులు చేసిన  ప్రకటనను స్వాగతించి కేంద్రప్రభుత్వం శాంతి చర్చలు జరపాలని కోరారు.

రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరారు. రేషన్ కార్డులు వెంటనే మంజూరు చేయాలని, గృహ జ్యోతి పథకం అందరికి అమలు కావడం లేదనీ, అర్హులందరికీ  గృహ జ్యోతి పథకం అమలు చేయాలన్నారు. సబ్సిడీ గ్యాస్ గ్యాస్ సిలిండర్ లను అందరికీ వర్తింపజేసి, ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందుబాటులోకి తీసుకు రావాలని కోరారు.

సిపిఐ జిల్లా మహాసభలు

జూన్ 21-22 తేదీలలో పూర్తి చేయాలని, ఆ లోపు జిల్లా వ్యాప్తంగా పట్టణ, మండల మహాసభలు పూర్తి చేయాలని కోరారు. జిల్లా మండల,పట్టణ మహాసభలు విజయవంతం చేయాలని కోరారు. ఆగస్టు19 నుండి 21వరకు రాష్ట్ర మహా సభలు మేడ్చల్ లో జరుగుతా యని, సెపెంబర్ 21 నుండి 25 జాతీయ మహాసభలు పంజాబ్ రాష్ట్రం చండీగఢ్ లో జరుగుతాయని వివరించారు.

ఈ సమావేశంలో జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్, రాష్ట్ర సమితి సభ్యులు మేకల దాసు, జిల్లా సమితి సభ్యులు సలేంద్ర సత్యనారాయణ, మిట్టపల్లి వెంకట స్వామి, జోగుల మల్లయ్య, లింగం రవి, మిట్టపల్లి శ్రీనివాస్, ముస్కే సమ్మయ్య, ఎస్కే బాజిసైద, దుర్గరాజ్, మేదరీ దేవవరం, బొంతల లక్ష్మీనారాయణ, ఆడెపు రాజమొగిలి, పెరిక రాజేశంలు పాల్గొన్నారు.