8 July, 2026 | 8:04 PM

Breaking News

నగరంలోని పలు డివిజన్లలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన   •   ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడమే లక్ష్యం   •   కాంగ్రెస్ పార్టీ జిల్లా ఎస్సీ విభాగం పాల్వంచ టౌన్ అధ్యక్షుడిగా గోలి సదాశివ   •   అగ్నివీర్ ఇండియన్ నేవిలో ఉద్యోగం సాధించిన వ్యక్తికి సన్మానం   •   తెలంగాణ చౌక్ లో ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు   •   తుంగతుర్తి లైన్స్ క్లబ్ చేస్తున్న సేవలు మరువలేనివి   •   కరీంనగర్ డీసీసీ కార్యాలయంలో ఘనంగా వైఎస్ఆర్ జయంతి వేడుకలు   •   ఉపాధ్యాయులకు శిక్షణ ప్రారంభం   •   ప్రియదర్శిని మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో ఐబీఎం స్కిల్స్‌బిల్డ్–టాస్క్ శిక్షణ ముగింపు   •   బాన్సువాడలోని ఆదిత్య స్కూల్ పై మున్సిపల్ కమిషనర్ కు ఫిర్యాదు   •  

బాలుడి ప్రాణాలు నిలిపిన కిమ్స్

29-08-2024 01:28 AM
  1. ఛత్తీస్‌గఢ్ నుంచి విమానంలో.. 
  2. రికెట్షియల్ ఇన్‌ఫెక్షన్‌కు చికిత్స

హైదరాబాద్, ఆగస్టు 28 (విజయక్రాంతి): అరుదైన ఇన్ఫెక్షన్ కారణంగా తీవ్ర అనారోగ్యానికి గురైన 12 ఏండ్ల బాలుడికి సికింద్రాబాద్‌లోని కిమ్స్ హాస్పిటల్ వైద్యులు చికిత్సచేసి ప్రాణాలు కాపాడారు. సొంత తల్లిదండ్రులను కూడా గుర్తుపట్టలేని స్థితిలో ఉన్న ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌కు చెందిన బాలుడిని ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు తీసుకొచ్చారు. బాలుడికి రికెట్షియల్ ఇన్ఫెక్షన్ వచ్చింది. ఇది రాయ్‌పూర్ ప్రాంతంలో చాలా అరుదు. మెదడులో మెర్స్ అనే సమస్య వచ్చింది. తర్వాత కాలే యం, మూత్రపిండాల సమస్యలు కూడా వచ్చాయి.

చికిత్స అనంతరం బాలుడు తొమ్మిదో రోజుకు పూర్తిగా కోలుకున్నాడు. దీంతో డిశ్చార్జి చేశాం’ అని కిమ్స్ కడల్స్ పీడియాట్రిక్స్ విభాగం క్లినికల్ డైరెక్టర్, పీడియాట్రిక్ ఐసీయూ విభాగాధిపతి డాక్టర్ పరాగ్ శంకర్‌రావు డెకాటే ఒక ప్రకటనలో తెలిపారు. దేశంలోని ఏ ప్రాంతంలో ఎంత సంక్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్న రోగులకైనా చికిత్స అందించగల సామర్థ్యం కిమ్స్ కడల్స్ హాస్పిటల్‌కు ఉందని డాక్టర్ అవినాష్, డాక్టర్ కళ్యాణ్ చెప్పారు. ఎయిర్ అంబులెన్స్ కొంత ఖర్చుతో కూడుకున్న వ్యవహారమే గానీ, ప్రాణాలకంటే ఏదీ ఎక్కువ కాదని పేర్కొన్నారు. అత్యాధునిక సదుపాయాలు లేని నగరాల నుంచి అవి ఉన్నచోటుకు సరైన సమయానికి సమర్థమైన చికిత్స కోసం తీసుకురావడం కీలకమని తెలిపారు.