10-12-2025 08:22:47 PM
ఈ - డిస్ట్రిక్ట్ మేనేజర్ గౌతమ్..
కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): జిల్లాలోని మీ - సేవా కేంద్రాల నిర్వహకులు ప్రభుత్వ నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని ఈ - డిస్ట్రిక్ట్ మేనేజర్ గౌతమ్ అన్నారు. బుధవారం జిల్లాలోని వాంకిడి మండల కేంద్రంలో గల మీ - సేవా కేంద్రాన్ని ఆకస్మికంగా సందర్శించి రికార్డులు, దరఖాస్తులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఈ - డిస్ట్రిక్ట్ మేనేజర్ మాట్లాడుతూ మీ - సేవా కేంద్రాల నిర్వహకులు ప్రభుత్వ నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని తెలిపారు. దరఖాస్తులను ఎలాంటి తప్పులు లేకుండా నమోదు చేయాలని, ప్రభుత్వం నిర్దేశించిన సేవా రుసుమును మాత్రమే తీసుకోవాలని తెలిపారు. అధిక ధరలు వసూలు చేసిన, నిబంధనలు ఉల్లంఘించిన మీ - సేవా కేంద్రాలపై కేసులు నమోదు చేసి చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మీ - సేవా కేంద్రాల నిర్వాహకులు, ప్రజలు, రైతులు పాల్గొన్నారు.