17-08-2025 05:40:06 PM
భద్రాద్రి కొత్తగూడెం,(విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండల పరిధిలోని కిన్నెరసాని గిరిజన గురుకుల పాఠశాల స్వర్ణోత్సవ సన్నాహక సమావేశం ఆదివారం నిర్వహించారు. ఈ సమావేశంలో పూర్వ ఉపాధ్యాయులు, విద్యార్థులు చక్రవర్తి, కాలేజీ ప్రిన్సిపాల్ గోగ్గేలా రమేష్, స్కూల్ ప్రిన్సిపాల్ శ్యామ్ కుమార్ సూతకాని, ఖాదర్ రిటైర్డ్ ప్రిన్సిపాల్ పాల్గొని, పాల్వంచ పట్టణ పరిధి షాన్భాగ్ ఫంక్షన్ హాల్లో మరో 3 నెలల్లో నిర్వహించే స్వర్ణోత్సవ వేడుక సన్నాహక సమావేశం విజయవంతనికి 15 రకాల కమిటీలను చక్రవర్తి ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... 1975 ఏర్పాటు అయినా గురుకుల పాఠశాలలో కిన్నెరసాని ప్రధమనీ, వేల మంది విద్యార్థులు విద్యను అభ్యసించి ఉన్నత స్థాయి కు వెళ్లారన్నారు. ఖండాలు దాటి ఎదిగిన అందరూ హాజరైయి.
కన్నతల్లి లాంటి చదివిన పాఠశాల అభివృధి కోసం, గత అనుబంధం, అనుభవాలాను పంచుకోవాలనీ కోరారు. అన్నీ రకాల కమిటీ బాధ్యులు విజయవంతం చేయాలని, సమావేశంకు హాజరు అయ్యేలా గూగుల్ షిట్ లో నమోదు చేయాలని కోరారు. ఇప్పటి వరకు సుమారు 800 మంది విద్యార్థులు నమోదు అయినట్లు తెలిపారు. గతంలో పనిచేసిన ఉపాధ్యాయులు, పూర్వ విద్యార్థులు చనిపోయిన వారికీ మౌనం పాటించి వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరారు. ఈ సందర్భం లో పూర్వ విద్యార్థుల కార్యక్రమం విజయవంతం కోసం సలహాలు సూచనలు చేశారు.