17-08-2025 05:47:54 PM
బెల్లంపల్లి అర్బన్,(విజయక్రాంతి): సీపీఐ రాష్ట్ర నాలుగో మహాసభలను జయప్రద చేయాలని ఆ పార్టీ బెల్లంపల్లి మండలం కార్యదర్శి బొంతల లక్ష్మీనారాయణ పిలుపునిచ్చారు. మాల గురజాల గ్రామంలో ఆదివారం సిపిఐ రాష్ట్ర నాలుగవ మహాసభ వాల్ పోస్టర్ను విడుదల చేశారు. ఈ సందర్భంగా సిపిఐ మండల కార్యదర్శి బొంతల లక్ష్మీనారాయణ మాట్లాడారు. భూమి కోసం భుక్తి కోసం పేద ప్రజల విముక్తి కోసం నాటి నుండి నేటి వరకు అనేక పోరాటాలు చేస్తూ 1925 నుండి 2025 వరకు 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్నదని పేర్కొన్నారు. నాటి స్వతంత్రం నుండి నేటి 79వ స్వాతంత్ర దినోత్సవo వరకూ పేద ప్రజలు పేదలుగాను ధనవంతులు ధనవంతులుగానే మిగిలి పోయారన్నారు.