calender_icon.png 9 January, 2026 | 1:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పదవ తరగతి విద్యార్థులకు స్టడీ మెటల్ పంపిణీ

07-01-2026 09:39:20 PM

కుభీర్,(విజయక్రాంతి): కుభీర్ లోని ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, కస్తూర్బా గాంధీ బాలికల గురుకుల విద్యాలయంలో బుధవారం భైంసాలోని ప్రజా ట్రస్ట్ ఆధ్వర్యంలో పదో తరగతి విద్యార్థులకు ఆల్ ఇన్ వన్ బుక్స్ ను ట్రస్ట్ చైర్మన్ మోహన్ రావు  పంపిణీ చేశారు. సుమారు 150 మంది విద్యార్థులకు అందించి.. అక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. పదో తరగతి విద్యార్థులు లక్ష్యాన్ని నిర్దేశించుకుని పట్టుదలతో చదివి పదో తరగతిలో 100% ఉత్తీర్ణతను సాధించాలని సూచించారు.

ప్రజా ట్రస్టు ద్వారా పేద విద్యార్థులకు తమ వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ అందిస్తామని పేర్కొన్నారు. క్రమశిక్షణతో మంచి విద్యాబుద్ధులు నేర్చుకోవాలని సూచించారు. ఉపాధ్యాయులు నేర్పించే పాఠాలను శ్రద్ధతో విని ఉన్నత విద్యావంతులుగా ఎదగాలని ఆకాంక్షించారు. నేటి తరం పిల్లలు సెల్ ఫోను వాడటం, సోషల్ మీడియాకు దూరంగా ఉండడం మంచిదన్నారు. వీటి వాడకాన్ని తగ్గించుకోవాల్సిన అవసరం విద్యార్థులపై ఎంతైనా ఉందన్నారు. విద్యార్థులు కష్టపడి కాకుండా ఇష్టపడి చదివితే మంచి ఫలితాలు సాధించడం ఖాయమన్నారు.