07-01-2026 09:59:54 PM
– ఆర్మూర్ మండల విద్యాధికారి రాజగంగారాం
ఆర్మూర్,(విజయక్రాంతి): తెలంగాణ సర్వశిక్షాభియాన్ సహిత విద్యా విభాగం ఆధ్వర్యంలో అందిచే ఉచిత ఫిజియోథెరపీ శిక్షణ సేవల ప్రాధాన్యతను గుర్తించి వైకల్యంతో బాధపడే పిల్లల తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకోవాలని ఆర్మూర్ మండల విద్యాధికారి రాజగంగారాం సూచించారు. ఆర్మూర్ పట్టణంలోని భవిత కేంద్రంలో ఉచిత ఫిజియోథెరపీ శిబిరాన్ని బుధవారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భవిత కేంద్రంలో ప్రతీ వారం ఉచితంగా ఫిజియోథెరపీ సేవలను అందిస్తున్నామన్నారు. సెరిబ్రల్ పాల్సీతో బాధపడుతున్న 18 సంవత్సరాల లోపు వయసు గల పిల్లలకు ఉచితంగా ఫిజియోథెరపీ సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఫిజియోథెరపీ వైద్యురాలు అరుణ చిన్నారులకు ఫిజియోథెరపీ చికిత్సను అందించారు. ఈ శిబిరంలో ఇన్‌క్లూసివ్ ఎడ్యుకేషన్ రిసోర్స్ పర్సన్ కిషన్, సురేష్, ఎంఐఎస్ కోఆర్డినేటర్ అలేఖ్య , ఆపరేటర్ రఘు, మెసెంజర్ రవి, సీజీవీ కవిత తదితరులు పాల్గొన్నారు.