07-01-2026 09:56:25 PM
అర్మూర్,(విజయక్రాంతి): ఆర్మూర్ పట్టణంలోని 36 వార్డులకు సంబంధించిన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఆర్మూర్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ఆదేశాల మేరకు పట్టణ అధ్యక్షుడు మందుల బాలు ఆధ్వర్యంలో పంపిణీ చేశారు. సుమారు 11 లక్షల రూ. 85 వేల చెక్కులను 52 మంది లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ మాజీ అధ్యక్షుడు డ్యాగ ఉదయ్, ఖండేష్ ప్రశాంత్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.