07-01-2026 10:03:55 PM
- రాబోయే మున్సిపల్ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ పార్టీ సమాయత్తo
అర్మూర్,(విజయక్రాంతి): రాబోయే మున్సిపల్ పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవాలని డీసీసీ అధ్యక్షుడు నగేష్ రెడ్డి పిలువునిచ్చారు. బుధవారం ఆర్మూర్ పట్టణంలోని సి కన్వెన్షన్ హల్ లో సమావేశం పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సాయి బాబా గౌడ్ ఆధ్వర్యంలో మున్సిపల్ ఎన్నికల సమాయత్త సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమనికి ముఖ్య అతిధులుగా నిజామాబాద్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాటిపల్లి నగేష్ రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి ఏబి చిన్నా, మార చంద్రమోహన్, ఆర్మూర్ నియోజక వర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ప్రొద్దుటూరు వినయ్ కుమార్ రెడ్డిలు హాజరయ్యారు. మున్సిపాల్టీల్లో వార్డుల అభ్యర్థుల ఎంపిక, విజయం సాధించేందుకు తీసుకోవాల్సిన కార్యాచరణ, ఎన్నికల నిర్వహణపైనా చర్చించారు. వార్డు అభ్యర్థుల ఎంపికను అత్యంత పకడ్బందీగా చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు.
అందుకోసం ప్రతి వార్డులో, ముగ్గురి చొప్పున అభ్యర్థుల ప్రతిపాదనలను స్వీకరించి ఒక సర్వే నిర్వహించి సరైన అభ్యర్థులను ఎంపిక చేయాలని కీలక నిర్ణయం తీసుకున్నారు. అభ్యర్థుల పేర్లను డీసీసీలు, టీపీసీసీలకు పంపిస్తే తుది జాబితాను ప్రకటిస్తుందని వినయ్ రెడ్డి పేర్కొన్నారు. అదేవిధంగా అధిష్టానం ఎవరికి టిక్కెట్ ఇచ్చిన అందరూ ఆ అభ్యర్థిని గెలిపించే దిశగా పని చేయాలని, పార్టీ నిర్ణయానికి కట్టుబడని వ్యక్తులను పార్టీ ఎట్టి పరిస్థితుల్లో ఉపక్షించేది లేదని తీర్మానించారు. తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్న అభివృద్ధిని చూసి వార్డులో ప్రచారం నిర్వహించాలని సూచించారు.