calender_icon.png 9 January, 2026 | 1:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డయాగ్నొస్టిక్ క్లినిక్స్‌ తనిఖీలు చేయాలి

07-01-2026 09:52:41 PM

జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఇందిర 

మహబూబ్ నగర్,(విజయక్రాంతి): లింగ నిర్ధారణ డయాగ్నొస్టిక్ క్లినిక్స్ ప్లాను తనిఖీ చేయాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఇందిర అన్నారు.బుధవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం లో బుధవారం అదనపు కలెక్టర్ (లోకల్ బాడీస్) శివేంద్ర ప్రతాప్‌, జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఇందిరతో కలిసి జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. పుట్టబోయే శిశువు లింగాన్ని వెల్లడించినట్లయితే సంబంధిత వ్యక్తులు, క్లినిక్స్‌పై క్రిమినల్ కేసులు నమోదు చేసి కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. పీసీపీఎన్‌డీటీ చట్టాన్ని కట్టుదిట్టంగా అమలు చేయాల్సిన అవసరాన్ని ఆమె పేర్కొన్నారు. ప్రస్తుతం మహబూబ్‌నగర్ జిల్లాలో స్త్రీ,పురుష నిష్పత్తి 1000 మంది పురుషులకు 964 మహిళలుగా ఉంది ఉన్నారని, లింగ నిష్పత్తి పరిరక్షణకు కఠిన పర్యవేక్షణ అవసరమని ఆమె అధికారులు తెలిపారు.  

ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్ మాట్లాడుతూ జిల్లాలో ఉన్న అన్ని గర్భిణీ లింగ నిర్ధారణ డయాగ్నొస్టిక్ క్లినిక్స్‌ (పీసీపీఎన్‌డీటీ), స్కానింగ్ కేంద్రాలను గుర్తించి, 90 రోజుల్లోపు పూర్తిస్థాయిలో తనిఖీలు నిర్వహించి  సమగ్ర నివేదికను సమర్పించాలని అధికారులను ఆదేశించారు. మహబూబ్‌నగర్ జిల్లాలో మొత్తం 85 గర్భకాల నిర్ధారణ కేంద్రాలు ఉన్నాయని అధికారులు తెలిపారు. గర్భిణీ మహిళల స్కానింగ్ సమయంలో పుట్టబోయే శిశువు లింగాన్ని వెల్లడించడం చట్టవిరుద్ధమని స్పష్టం చేశారు. అన్ని క్లినిక్స్‌ తమ కేంద్రాల ముందు లింగ నిర్ధారణ నిషేధమని స్పష్టంగా తెలియజేసే బోర్డులు తప్పనిసరిగా ప్రదర్శించాలన్నారు అదనపు కలెక్టర్ ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా వైద్య, ఆరోగ్య అధికారి డా. కృష్ణ, అదనపు ఎస్పీ రత్నం, డి.ఈ.ఎం.ఓ మంజుల, ఐ.ఎం.ఏ ప్రతినిధి రామ్‌మోహన్‌తో పాటు ఇతర సంబంధిత అధికారులు పాల్గొన్నారు.