calender_icon.png 9 January, 2026 | 1:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్ పార్టీలో భారీగా చేరికలు

07-01-2026 10:09:22 PM

చెన్నూర్,(విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా చెన్నూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వివిధ పార్టీలకు చెందిన నాయకులు బుధవారం పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలో చేరారు. బీజేపీ పార్టీ నుండి మాజీ మార్కెట్ కమిటీ అధ్యక్షుడు బత్తుల సమ్మయ్య, మాజీ ఎంపీటీసీ రాజేష్ తో సుమారు 200 మంది కాంగ్రెస్ పార్టీలో చేరగా వారికి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి మంత్రి వివేక్ వెంకటస్వామి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తున్నామనీ, 50 వేల టీచర్ పోస్టులను భర్తీ చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదే అని అన్నారు.

జైపూర్ సింగరేణి పవర్ ప్లాంట్ లో నూతనంగా 850 మెగా వాట్ల ప్లాంట్ కు భూమి పూజ చేసుకున్నామనీ, నేను ఎమ్మెల్యే అయ్యాక సింగరేణిలో 80 శాతం స్థానికులకే ఉద్యోగాలు వచ్చేలా చూస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా డీసీసీ అధ్యక్షుడు రఘునాథ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీష్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు కుర్మ  రాజమల్ల గౌడ్, మాజీ కోటపల్లి మండల పిఏసిఏ అధ్యక్షుడు గొడిసెల బాపు రెడ్డి, కోటపల్లి మండల పార్టి అధ్యక్షుడు మహేష్  ప్రసాద్ తివారి, తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.