07-01-2026 09:47:08 PM
మాజీ సింగిల్ విండో చైర్మన్ వెంకట్ రెడ్డి
జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి): అభివృద్ధి, ప్రజల సంక్షేమమే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ లక్ష్యమని మాజీ సింగిల్ విండో చైర్మన్ ఇందుర్తి వెంకట్ రెడ్డి అన్నారు. మండల పరిధిలోని తిమ్మాపురం గ్రామ జంగాల కాలనీకి చెందిన పర్వతం సైదమ్మ,సిరిశాల రత్నమ్మలకు ప్రభుత్వం నుండి మంజూరి అయినా ఒక్కొక్కరికి రూ.లక్ష 116ల కళ్యాణ లక్ష్మి చెక్కులను బుధవారం తిరుమలగిరిలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే మందుల సామేలు ఆదేశానుసారం తహసీల్దార్ శ్రీకాంత్ తో కలిసి లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో అభివృద్ధి,సంక్షేమ పథకాలు కొనసాగుతున్నాయని,ప్రజా ప్రభుత్వంలో ప్రభుత్వం నుండి వచ్చే పథకాలను అర్హులైన ప్రతి లబ్ధిదారునికి అందించేందుకు అహర్నిశలు కృషి చేస్తానన్నారు.