07-01-2026 10:20:13 PM
ఉప్పల్,(విజయక్రాంతి): శబ్ద కాలుష్య నియంత్రణ నిబంధనలను పాటించాలని డీజే సౌండ్ సిస్టం ఆపరేటర్లకు ఉప్పల్ ఏసిపి ఎస్ చక్రపాణి సూచించారు. బుధవారం రోజున ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఉన్న ఫంక్షనల్ డీజే ఆపరేటర్స్ తో ఆయన సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా శబ్ద కాలుష్యం సంబంధించిన నిబంధనలను వారికి తెలియజేశారు. రాత్రి 10 తర్వాత ఎవరు కూడా నిబంధనలను అతిక్రమించకుండా ఉండాలని అతిక్రమిస్తే చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఉప్పల్ ఇన్స్పెక్టర్ భాస్కర్ సబ్ ఇన్స్పెక్టర్లు పాల్గొన్నారు.
నాచారంలో అర్ధరాత్రి వరకు డీజే నిర్వహిస్తే చర్యలు తప్పవని నాచారం ఇన్స్పెక్టర్ ధనుంజయ్ గౌడ్ అన్నారు. నాచారం పోలీస్ స్టేషన్లో డీజే ఆపరేటర్ తో సమావేశం నిర్వహించిన ఆయన అధిక శబ్దంతో సంగీతం వాయిస్తే కఠిన చర్యలు తప్పవని నిర్వాహకులకు హెచ్చరించారు. హైకోర్టు ఆదేశాల ప్రకారం అర్ధరాత్రి సమయంలో అధిక శబ్దంతో నిర్వహిస్తే డీజే పరికరాలు కూడా సీజ్ చేస్తామని ఆయన సూచించారు. నిబంధనలు పాటించి పోలీస్ పర్మిషన్ తోనే డీజే తక్కువ మోతాదు సౌండ్ ను ఉపయోగించాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో అడ్మిన్ సబ్ ఇన్స్పెక్టర్ వెంకటయ్య ప్రభాకర్ రెడ్డి మై బల్లి పాల్గొన్నారు