calender_icon.png 5 September, 2025 | 12:58 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కిష్కింధపురి అలాంటి సినిమానే

04-09-2025 12:43:36 AM

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మిస్టీరియస్ అకల్ట్ థ్రిల్లర్ ‘కిష్కింధపురి’ అలరించబోతున్నారు. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి కౌశిక్ పెగల్లపాటి దర్శకత్వం వహించారు. షైన్‌స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మిస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్ 12న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ మంగళవారం ఈ మూవీ ట్రైలర్‌ను లాంచ్ చేశారు.

ఈ కార్యక్రమంలో కథానాయకుడు సాయి శ్రీనివాస్ మాట్లాడుతూ.. “మంచి సినిమా వస్తే తప్పకుండా జనం థియేటర్స్‌కు వస్తారు. అది నేను నమ్ముతున్నా. మా ‘కిష్కింధపురి’ అలాంటి సినిమానే. ఒక మంచి థియేటర్ సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ ఇవ్వబోతున్నాం. సినిమా చూస్తున్నప్పుడు ఫోన్ కూడా చూసుకునే టైమ్ ఉండదు” అన్నారు. అనుపమ పరమేశ్వరన్ మాట్లాడుతూ.. “హారర్ నాకు ఇష్టమైన జానర్.

డైరెక్టర్ కౌశిక్ ఈ సినిమా కథ చెప్పిన వెంటనే నాకు నచ్చింది. సాయితో కలిసి చేసిన ‘రాక్షసుడు’ మాకు వెరీ మెమొరబుల్ ఫిలిం. మళ్లీ చాలా రోజుల తర్వాత ఆయనతో ఇలాంటి డిఫరెంట్ సినిమా చేయడం ఆనందాన్నిచ్చింది” అని చెప్పారు. ‘ఈ సినిమా అందరి అంచనాలకు మించి ఉంటుంది.

సినిమాలో ఫెంటాస్టిక్ విజువల్స్ ఉంటాయి’ అని చిత్ర దర్శకుడు తెలిపారు. చిత్ర నిర్మాత సాహు గారపాటి మాట్లా డుతూ.. “మా హీరో, హీరోయిన్, టీమ్ అందరూ చాలా కష్టపడి పనిచేశారు. వారి కష్టానికి మంచి గుర్తింపు తెచ్చే సినిమా అవుతుంది” అన్నారు.  ఈ కార్యక్రమంలో మ్యూజిక్ డైరెక్టర్ చైతన్ భరద్వాజ్, చిత్రబృందం పాల్గొన్నారు.