calender_icon.png 7 September, 2025 | 7:32 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అందుకే ఎక్కువగా బయట కనిపించను

04-09-2025 12:47:56 AM

అనుష్క శెట్టి ప్రధాన పాత్రలో నటించిన యాక్షన్ డ్రామా ‘ఘాటి’. విక్రమ్ ప్రభు మేల్ లీడ్ రోల్ పోషించారు. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ సమర్పణలో ఫస్ట్‌ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై రాజీవ్‌రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి నిర్మించారు. సెప్టెంబర్ 5న ఈ సినిమా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర కథానాయకి అనుష్క పంచుకున్న సినిమా విశేషాలివీ.. 

* నా ఫిలిం జర్నీలో 20 ఇయర్ ఇది. ఇలాంటి సందర్భంలో ‘ఘాటి’ లాంటి యాక్షన్ అడ్వెంచర్ సినిమా చేయడం -చాలా ఎక్సుటైంగ్‌గా ఉంది. శీలావతి లాంటి పాత్ర నేను గతంలో ఎప్పుడూ చేయలేదు.  

* శీలావతి క్యారెక్టర్ కూడా అంత బలంగా, డిఫరెంట్ షేడ్‌తో ఉంటుంది. ఈ క్యారెక్టర్ నా ఫిల్మోగ్రఫీలో ఎప్పటికీ నిలిచిపోతుంది. 

* ప్రతి మహిళా సాధారణంగా, సున్నితంగా కనిపిస్తారు. కానీ, సందర్భం వచ్చినప్పుడు ఒక బలమైన పిల్లర్ లాగా నిలబడతారు. స్త్రీలలో ఉండే గొప్ప క్వాలిటీ అది. క్రిష్ అలాంటి ఒక బలమైన పాత్రను తీర్చిదిద్దారు. 

* కథ విన్నప్పుడు ఆసక్తిగా అనిపించింది. లొకేషన్స్‌కు వెళ్లిన తర్వాత ఒక కొత్త క్యారెక్టర్, కల్చర్, ఒక కొత్త విజువల్‌ను ప్రేక్షకులకు చూపించబోతున్నామనే ఆనందం కలిగింది. దేశిరాజు క్యారెక్టర్‌కి -విక్రమ్‌ప్రభు పర్ఫెక్ట్ యాప్ట్. ఆయన నాకు ముందు నుంచే తెలుసు. వెరీ నైస్ జెంటిల్‌మెన్.  

* క్రిష్ ఎప్పుడు కూడా సోషల్‌గా రెలెవెంట్ ఉండే కథలనే ఎంచుకుంటారు. సొసైటీలో ఉండే సీరియస్ ఇష్యూ గంజాయి. మేము ఈ సినిమాను యాక్షన్ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గానే తీశాం. అయితే ఈ కథలో నే మంచి సందేశం కూడా ఉంది. అది చాలా పాజిటివ్‌గా ఉంటుంది. 

* నేను ఎక్కువ ప్రయాణం చేస్తుంటాను. చదువుతాను.. ప్రస్తుతం మహాభారతం చదువుతున్నా. మూవీస్ కూడా చూస్తా. రెండేళ్లుగా ఎక్కువగా సమయం కుటుంబంతోనే గడుపుతున్నా. అందుకే బయట కూడా ఎక్కువగా కనిపించను. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండను. 

* ఈ సినిమాను ఆంధ్ర-ఒడిశా బార్డర్‌లో షూట్ చేశాం. అలాంటి రిమోట్ ఏరియాలో కూడా నన్ను చూడడానికి అభి మానులు భారీ సంఖ్యలో వచ్చారు. -అభిమానులు, ప్రేక్షకులకు ఎప్పుడూ కృతజ్ఞతతో ఉంటాను. రాజమౌళి లాంటి దర్శకులు ‘బాహుబలి’ లాంటి చిత్రాల్లో నన్ను అద్భుతంగా చూపించడం వల్లే ఇది సాధ్యమైంది. ఒక మంచి చేస్తే ప్రపం చం నలుమూలల నుంచి గుర్తింపు దొరుకుతుంది. ఇది పవర్ ఆఫ్ సినిమాగా భావిస్తున్నా. 

* నేను చేసిన చాలా సినిమాలు హార్డ్ వర్క్‌తో కూడుకున్నవే. ‘ఘాటి’లో కూడా ఫిజికల్ హార్డ్ వర్క్ ఉంది. అయితే ఇలాంటి కొత్త లొకేషన్స్‌లో షూట్ చేయడం చాలా ఎక్సుటైంగ్‌గా అనిపించింది. మెమరబుల్ ఎక్స్‌పీరియన్స్.   

* నాకు అవుట్ అండ్ అవుట్ నెగిటివ్ క్యారెక్టర్ చేయాలనుంది.  కొత్త కథలు -వింటున్నా. మంచి లైన్ అప్ ఉంది. మలయాళంలో తొలిసారి ఓ మూవీ చేస్తు న్నా. తెలుగులో కూడా ఓ కొత్త సినిమా ప్రకటన ఉంటుంది.