calender_icon.png 3 August, 2025 | 3:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సింగరేణి నిర్లక్ష్యం వల్లే గని ప్రమాదం

02-08-2025 11:51:33 PM

మంత్రి వివేక్ వెంకటస్వామి

రామకృష్ణాపూర్,(విజయక్రాంతి): సింగరేణి అధికారుల నిర్లక్ష్యం వల్లనే కేకే 5 గని ప్రమాదం చోటు చేసుకుందని కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి ఆరోపించారు. శనివారం పట్టణంలోని సింగరేణి ఏరియా ఆసుపత్రి మార్చరీలో ఉన్న రాసపల్లి శ్రావణ్ కుమార్ మృతదేహానికి నివాళులు అర్పించారు. మృతుని కుటుంబ సభ్యులను ఓదార్చారు. అనంతరం విలేకరుల సమావేశం ఆయన మాట్లాడుతూ గనిలో సేఫ్టీ అధికారులు కనీస జాగ్రత్తలు తీసుకోకపోవడం,కాలం చెల్లిన యంత్రాలను వినియోగించడం వల్లే ప్రమాదాలకు కారణమవుతుందని అన్నారు. ఈ ప్రమాదానికి కారణమైన అధికారులపై వెంటనే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సింగరేణిలో ఉత్తమమైన ప్రమాణాలతో కూడిన యంత్రాలను వినియోగించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.