calender_icon.png 23 October, 2025 | 5:41 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కొమరంభీం పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలి

23-10-2025 12:44:05 AM

-ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్

-రైతులకు సబ్సిడీ శనగ విత్తనాల పంపిణీ

ఆదిలాబాద్, అక్టోబర్ 22(విజయక్రాంతి): హక్కుల సాధన కోసం పోరాట యోధు డు కొమరం భీం పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకొని ముందుకు సాగాలని ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు పటేల్ అన్నారు. బుధవారం మండలంలోని శాంపూర్ రైతు వేదికలో ఏర్పాటు చేసిన సబ్సిడీ శనగ విత్తనాల పంపి ణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ముందుగా రైతు వేదిక వద్ద కొమురం భీం జయంతి సందర్భంగా కొమురం భీం చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు.  అనంతరం రైతులకు సబ్సిడీ శనగ విత్తనాల బ్యాగులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... కొమురం భీం పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకొవలన్నారు.రైతుల, ప్రజల కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిందన్నారు. రైతులంతా సేంద్రి య ఎరువుల వాడకాన్ని చేపట్టి భూముల సారం పోకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధి కారి రమేష్,  ఏ.ఈ.ఓలు రవీందర్, జయశ్రీ, సహకార సంఘం చైర్మన్ ఎస్.పి రెడ్డి, ఆర్టిఏ జిల్లా సభ్యులు దూట రాజేశ్వర్, మాజీ సర్పంచ్ జాదవ్ జగదీశ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.