calender_icon.png 23 October, 2025 | 1:25 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహనీయుల స్ఫూర్తితో ముందుకు సాగాలి

23-10-2025 12:42:46 AM

ఎమ్మెల్యే కోవ లక్ష్మి

కుమ్రం భీం ఆసిఫాబాద్, అక్టోబర్ 22(విజయక్రాంతి): ఆసిఫాబాద్ మండలం రౌట సంకపల్లి గ్రామంలో  కుమ్రం భీం, ఎడ్ల కొం డు  125వ జయంతి ఉత్సవాల్లో ఎమ్మెల్యే కోవ లక్ష్మి, బీఆర్‌ఎస్ నాయకురాలు మర్సకోల సరస్వతి  పాల్గొన్నారు. ఈ సందర్భం గా కుమ్రం భీం, ఎడ్ల కొండు విగ్రహాలకు పూలమాల వేసి నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గిరిజన తెగల హక్కుల కోసం, జల్-జంగల్-జమీన్ కోసం పోరాడిన కుంరం భీం,ఎడ్ల కొండు ఆదర్శాలను ప్రస్తుత పాలకులు స్ఫూర్తిగా తీసుకోవాలని, మహనీయులు చూపిన మార్గంలో హక్కుల పరిరక్షణ కోసం, ఈ ప్రాంత అభివృద్ధి కోసం మనమంతా ఐక్యం గా పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డిడి రమాదేవి, సిడం అర్జు మాస్ట ర్, మాజీ సర్పంచ్ కిష్టయ్య, సింగిల్ విండో చైర్మన్ అలిబిన్ అహ్మద్, అరిగేలా నాగేశ్వర్ రావు, బలరాం నాయక్, గుణవంత్ రావు, కుంరం భీము వారసులు కుంరం వెంకటేష్, కుంరం రాము, కుంరం సితారాం, కుంరం అంబారావ్ పాల్గొన్నారు.