calender_icon.png 23 October, 2025 | 10:10 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైతుల సమస్యలను పరిష్కరించండి

23-10-2025 12:45:14 AM

మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు ఎమ్మెల్యే పాయల్ వినతి

ఆదిలాబాద్, అక్టోబర్ 22 (విజయక్రాం తి): పండించిన పంటను అమ్ముకునేందుకు రైతులు పడుతున్న ఇబ్బందులను తొలగించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు ఎమ్మెల్యే పాయల్ శంకర్ విన్నవించారు.ఈ మేరకు మంగళవారం హైదరాబాద్‌లో మంత్రి తుమ్మల నాగేశ్వరరావును కలిసి వినతి పత్రం ఇచ్చారు. సోయాబీన్ పం టకు ప్రభుత్వమే కనీస మద్దతు ధరతో కొనుగోలు చేయాలని ఎమ్మెల్యే  కోరారు.

రైతులు మార్కెట్లో తక్కువ ధరలకు అమ్మతున్నారనీ,  ప్రస్తుతం రైతులు క్వింటాల్కు రూ.1200 రూ.1500 వరకు నష్టపోతున్నారన్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో పంట నష్టపోయి న రైతులకు బెంగాల్ గ్రామ్ విత్తనాలను సబ్సిడీపై ఇవ్వాలని కోరారు. పత్తి అమ్మకాలకు వచ్చే రైతులు గంటల కొద్దీ వేచిచూసే పరిస్థితి ఉందనీ, అందువల్ల మార్కెట్ యార్డ్‌లో రైతులకు ఆహారం పంపిణీ చేయాలన్నారు. రైతుల ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. దీంతో మం త్రి తుమ్మల సానుకూలంగా స్పందించినట్లు ఎమ్మెల్యే పాయల్ పేర్కొన్నారు.