calender_icon.png 22 September, 2025 | 3:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కొండా లక్ష్మణ్ ఉద్యమ స్ఫూర్తితో ముందుకు సాగాలి

22-09-2025 01:46:12 AM

మాజీ మంత్రి రామన్న...

అదిలాబాద్, సెప్టెంబర్ 21 (విజయక్రాం తి): తొలి తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి దాత  ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయ సాధన దిశగా ప్రతి ఒక్కరూ ముందుకు నాగాలని మాజీ మంత్రి జోగు రామన్న అన్నారు. ఆదివారం కొండ లక్ష్మణ్ బాపూజీ  వర్ధంతి ని పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో మాజీ మంత్రి పాల్గొని కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి పూలమాలు వేసి ఘన నివాళులు అర్పించి  సంఘ సభ్యులతో కలిసి 2 నిముషాలు మౌనం పాటించారు.

అనంతరం జోగు రామన్న మాట్లాడుతూ తెలంగాణ ఆశాయ సాధనకు ఎమ్మెల్యే, మంత్రి పదవులకు ప్రాధాన్యం లేదని నిరూపించిన మొట్టమొదటి మనిషి ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ ని అన్నారు. ఆయన స్ఫూర్తితో సాధించుకున్న ప్రత్యేక తెలంగాణలో మరిన్ని తరాలకు ప్రేరణ ఇచ్చేలా ట్యాంక్‌బండ్‌పై ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగిందని గుర్తు చేశారు.

ఈ కార్యక్రమంలో సంఘం నాయకురాలు మంచికట్ల ఆశమ్మ, జిట్టా రమేష్, బొమ్మ కంటి రమేష్, చిల్కా విలాస్, మోర ఆశన్న, దాసరి రమేష్, అనుముల ఉషాన్న, శ్యామల ప్రశాంత్, నవత, జ్యోతి తదితరులు పాల్గొన్నారు.

సమాజానికి దిక్సూచి కొండ లక్ష్మణ్ బాపూజీ: జఎమ్మెల్యే పాయల్ శంకర్..

అదిలాబాద్: ప్రత్యేక రాష్ర్టమే లక్ష్యంగా ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ ఉద్యమాలకు ఊపిరి పోసి రాష్ర్టం సిద్ధించే వరకు పోరాడి అమరుడైన మహా నాయకుడని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి సందర్భంగా ఆదిలాబాద్‌లోని కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. పేద బడుగు వర్గాల కోసం తెలంగాణ విముక్తి కోసం తన జీవితాన్ని త్యాగం చేశారని ఎమ్మెల్యే కొనియాడారు.

ప్రత్యేక తెలంగాణ రాష్ర్టం సిద్ధించినప్పటికీ ఇంకా ఆయన ఆశయాలు, ఆకాంక్షలు నెరవేరలేదని ఎమ్మెల్యే అన్నారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం నాయకులు మంచికట్ల ఆశమ్మ, బేత రమేష్, బీసీ సంఘం అధ్యక్షులు చిక్కాల దత్తు, బీజేపీ నా యకులు  విట్టల్, శ్రీనివాస్, రాకేష్ పద్మవర్, బాసదత్తు తదితరులు పాల్గొన్నారు.

కొండ లక్ష్మణ్ బాపూజీ నీ ఆదర్శంగా తీసుకోవాలి: పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షుడు ఆంజనేయులు 

కుమ్రం భీం ఆసిఫాబాద్ సెప్టెంబర్ 21 (విజయక్రాంతి): ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలని పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షుడు ఇరుకుల్లా ఆంజనేయులు అన్నారు.ఆదివారం జిల్లా కేంద్రంలోని పద్మశాలి భవనం లో పట్టణ సంఘం ఆధ్వర్యంలో బాపూజీ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలు వేసే నివాళులర్పించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వతం త్ర పోరాటంలోనూ తెలంగాణ రాష్ర్ట సాధన కోసం ఎంత కృషి చేసిన బాపూజీ పద్మశాలి అవడం గర్వకారణం అన్నారు.  ఈ కార్యక్రమంలో  పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు అను మాండ్ల శ్రీకాంత్, అల్లే శ్రీకాంత్ గౌరవ అధ్యక్షులు కోమటిపల్లి లింగయ్య , ఉమ్మడి జిల్లా మాజీ అధ్యక్షురాలు ఇరుకుల్ల మంగ, పట్టణ మహిళా అధ్యక్ష, కార్యదర్శులు జంజీరాల పుష్పలత,

చెన్నూరి సునీత,కోశాధికారి క్రాంతి, ప్రచార కార్యదర్శి గుజ్జ రేవతి, వనమాల లావణ్య, సంఘ నాయకులు గాజర్ల శైలేందర్, చిప్ప సురేష్, జంజీరాల శ్రీనివాస్, మోహన్, వనమాల ధర్మయ్య, మధుకర్, పొన్న తిరుపతి, గుజ్జ మోహన్, జంజీరాల లక్ష్మీనారాయణ, పొన్న రమేష్, అనుమాండ్ల రవీందర్, కోడూరి తిరుపతి, వనమాల వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.