calender_icon.png 22 September, 2025 | 1:47 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పదవీ గండం?

22-09-2025 12:00:00 AM

  1. కొత్త నిబంధనలతో పీఏసీఎస్ పాలకవర్గాల్లో ఆందోళన

దుర్వినియోగం కేసులున్న వారి పదవులకు ఎసరు

పదవీ కాలం పొడగిస్తూనే నిబంధనలతో ప్రభుత్వం మరో జీఓ విడుదల

జిల్లాలో నాలుగు సొసైటీలకు పొడగింపు తిరస్కరణ 

మెదక్, సెప్టెంబర్ 21(విజయక్రాంతి): వ్యవసాయ సహకార పరపతి సంఘం (పీఏ సీఎస్) లకు సంబంధించిన పాలక వర్గాల పదవీ కాలం ఈ ఏడాది ఆగస్టు 14తో ముగిసింది. పాలక వర్గాల పదవీ కాలాన్ని రెండో సారి ప్రభుత్వం మరో మారు పొడిగించింది. ఇప్పటికే ఎంపీటీసీలు, జెడ్పీ టీసీలు, సర్పంచులు, మున్సిపల్ పాలక వర్గాల పదవీ కా లం ముగియడంతో గ్రామ పంచాయతీల్లోనూ,

మున్సిపాలిటీల్లో ప్రభుత్వం ప్రత్యేక అధికారులను నియమించి పాలన కొనసాగిస్తుంది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది ఫిబ్రవరి 14 నుంచి 6 నెలలపాటు పొడిగించిన పీఏసీఎస్ పదవీ కాలం సైతం ఆగస్టు 14తో ముగియడంతో ప్రభుత్వం పీసీసీఎస్ లతోపాటు డీసీసీబీ పాలకమండళ్ల పదవీ కాలన్ని సైతం పొడిగిస్తూ జీఓ 386 ను విడుదల చేసింది. 

సర్వత్రా ఆందోళన..

పదవీ కాలం పొడిగించిన ప్రభుత్వం తా జాగా కొత్త నిబంధనలు విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పాలకవర్గాల్లో ఎవరైన పీఏసీఎస్ చైర్మన్ గాని, డైరెక్టర్ గాని రుణా లు తీసుకొని చెల్లించని పక్షంలో, నిధుల దుర్వినియోగంలో ప్రమేయం ఉన్న పాలకవర్గ ప్రతినిధులు, డైరెక్టర్లను వెంటనే పదవి నుంచి తొలగించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. దీంతో కొన్ని పీఏసీఎస్ పాలకవర్గాల్లో ఆం దోళన వ్యక్తమవుతుంది.

జిల్లా అధికారులు బకాయిలు ఉన్న డైరెక్టర్లు, నిధుల దుర్వినియోగం చేసిన వారికి ముందస్తుగా నోటీ సులు జారీ చేయడంతో పాటు సంబంధిత వివరాలను ప్రభుత్వానికి నివేదించారు. కా గా ఇప్పటికే నోటీసులు అందుకున్న డైరెక్టర్లు తమ బకాయిలను చెల్లించి పదవి గండం నుంచి తప్పించుకున్నారు. 

జిల్లాలో 32 సంఘాల్లో పాలకవర్గం పొడగింపు...

జిల్లా వ్యాప్తంగా 37 పీఏసీఎస్లు ఉండగా 32 సంఘాలను చిన్నపాటి దిద్దుబాటల్తో పాలకవర్గాన్ని పొడిగిం చడం జరిగింది. నిధుల దుర్వినియో గం, సొసైటీలు నష్టాల్లో ఉండ డం, అవినీతి ఆరోపణల నే పథ్యంలో నాలుగు సంఘాలపై అనర్హత వేటు వేశారు. వాటిలో రామాయంపేట, మ డూరు, ఇబ్రహీంపూర్, రేగోడు సొసైటీలకు అనర్హత వేటు వేసి పొడిగింపు ను తిరస్కరించి పర్సన్ ఇం చార్జిలకు బాధ్యతలు అప్పగించారు.

రాం పూర్ సొసైటీ ఇదివరకే రద్దు కావడం వల్ల పర్సన్ ఇంచార్జి పర్యవేక్షణలో కొనసాగుతు ంది. టేక్మాల్ సొసైటీ విషయంలో టెక్నికల్ పాయింట్ మిస్ కావడం వల్ల ఉత్తర్వులు మార్పులు, చేర్పులు జరిగాయి. డైరెక్టర్ల నిర్ణ యం మేరకే చైర్మన్ ఎంపికకు ఆమోదం చెప్పడం జరిగిందని సహకార శాఖ అధికారులు చెబు తున్నారు.