calender_icon.png 22 September, 2025 | 3:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రూ.కోట్లల్లో భూ కుంభకోణం

22-09-2025 01:44:02 AM

  1. ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులు, ఓ బీజేపీ నేత అరెస్ట్

పరారీలో సబ్ రిజిస్ట్రార్

అదిలాబాద్, సెప్టెంబర్ 21 (విజయక్రాం తి):  ఆదిలాబాద్ జిల్లాలో భూమాఫియా దారు లు రోజురోజుకు రెచ్చిపోతున్నారు. కోట్ల రూపాయల విలువ చేసే భూములను అక్రమంగా రిజిస్ట్రేషన్‌లు చేసుకుంటూ భూ మాఫియా దందా యదేచ్చగా సాగిస్తున్నా రు. ఇప్పటికే జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ నేతృత్వంలో పోలీసులు పలు భూమాఫియా దార్లపై కొరడా జూలిపిస్తుండగా, తాజాగా మరో భారీ భూ కుంభకోణాన్ని పోలీసులు బహిర్గతం చేశారు.

కిలీ పత్రాలు సృష్టించి డబుల్ రిజిస్ట్రేషన్ చేయించుకున్న ముఠాను మావల పోలీసులు అరెస్ట్ చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను మావల సీఐ కర్ర స్వామి మీడియా సమావేశంలో వెల్లడించారు. అదిలాబాద్ పట్టణంలోని కోట్ల విలువ చేసే 7 ప్లాట్లను నకిలీ పత్రాలు సృష్టించి రిజిస్ట్రేషన్ చేయించుకున్న మావల మాజీ సర్పంచ్, బీజేపీ నేత ఉష్కం రఘుతో పాటు, ప్రభుత్వ ఉద్యోగులైన ఆర్డబ్ల్యూఎస్ ఈఈ నానం వెంకట రమణ, ఆయుష్ విభాగంల రిమ్స్ ఉద్యోగి బెజ్జావార్ సంజీవ్ కుమార్‌ను అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపినట్లు సీఐ వివరించారు.

అయితే ఏడు లక్షలు లంచం తీసుకుని డబుల్ రిజిస్ట్రేషన్ కోసం వీరికి సహకరించిన సబ్ రిజిస్టార్ అశోక్ ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు సీఐ స్వామి తెలిపారు. బాధితుడు మిల్లింద్ కొర్తల్‌వార్ ఫిర్యాదుతో కేసు వెలుగులోకి వచ్చిందని నిందితులు ఒరిజినల్ సేల్ డీడ్స్ ఉన్నా పట్టించుకోకుండా నకిలీ పత్రాలు సృష్టించి డబుల్ రిజిస్ట్రేషన్ చేయించుకుని కోట్ల విలువైన భూమిని ఆక్రమించుకునేందుకు ప్లాన్ చేసినట్లు సీఐ స్వామి తెలిపారు.