22-09-2025 12:00:00 AM
-100 కోట్ల పనులకు ప్రతిపాదనలు
-సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్న మునిసిపల్ అధికారులు
-నిధులు వస్తేనే వరద కట్టడి
కామారెడ్డి, సెప్టెంబర్ 21 (విజయ క్రాంతి): కామారెడ్డిలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు భారీ వరదలు రావడం తో కామారెడ్డి అతలాకుతలం కావడం తో పలు కుటుంబాలు రోడ్డున పడ్డ విషయం విధితమే. కామారెడ్డిలో భారీ వర్షాలు కురిస్తే వరదలు ఇండ్లలోకి రాకుండా కట్టడి చేసేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటే వరద కట్టడి చేయవచ్చు అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు.
ఎక్కడ ఎక్కడ ఏ ఏ పనులు చేపడితే వరదలను నివారించవచ్చు ప్రతిపాదనలు తయారుచేసి పంపిం చాలని మున్సిపల్, ఆర్ అండ్ బి, పంచాయతీ రాజ్, నీటిపారుదల శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. టౌన్ ప్లానింగ్ అధికారులు కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఎక్కడెక్కడ వరద తాకిడి ఉన్న ప్రాంతాలను గుర్తించారు. అక్కడ చేపట్టాల్సిన పనుల కు ప్రతిపాదనలు తయారు చేసేందుకు సిద్ధమయ్యారు.
నెల రోజులు గడుస్తున్నప్రతిపాదనలకే పరిమితం
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కామారెడ్డి జిల్లా కేంద్రంలో వరద బాధితులను పరామర్శించి నెల రోజులు కావస్తున్న వరదల వల్ల జరిగిన నష్టం, వరద లు రాకుండా తీసుకోవాల్సిన చర్యలు పనుల ప్రతిపాదనలు పంపాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసి నెలరోజులవుతున్న అధికారులు మాత్రం ప్రతిపాదనలతోనే కాలం వెలదీస్తున్నారు.
సఖ్యత లేని అధికారులు
కామారెడ్డి జిల్లాలో అధికారుల మధ్య సఖ్యత లేక వరద బాధితులకు నష్టపరిహారం పంపిణీ చేయడంతో పాటు వరద ల వల్ల జరిగిన నష్టం వివరాలను ఆయా శాఖ ల అధికారులు పూర్తిస్థాయిలో ప్రభుత్వానికి నివేదించడంలో సఖ్యత లేక పోవడంతో కాలయాపన చేస్తున్నారు.
జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగువాన్ నష్టం వివరాల గురించి జిల్లా అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. రోడ్లు ధ్వంసం, కల్వర్టుల డ్యామేజీ, పంట నష్టం వివరాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి నష్ట వివరాలను అందించాలని ఆదేశాలు జారీ చేశారు. వ్యవసాయ శాఖ వ్యవసాయ శాఖ తో పాటు, రోడ్లు భవనాల శాఖ, పంచాయతీరాజ్, నీటిపారుల శాఖ, మున్సిపల్ శాఖ, రెవెన్యూ శాఖల అధికారులు ప్రతిపాదనలతోనే కాలం వెళ్లదీస్తున్నారు.
ఒక్కొక్క శాఖ ఒక్కొక్క రకంగా నివేదికలు తయారు చేయడం లో నిర్లక్ష్యం చేస్తున్నారు. మంత్రులు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరద బాధితులను పరామర్శించడమే కాకుండా నష్టం అంచనా వేసి క్షేత్రస్థాయిలో పరిశీలించి నివేదికలు తయారు చేసి పంపాలని ఆదేశాలు జారీ చేసి నెల రోజులు గడుస్తున్నా ఇంకా ప్రతిపాదనల తోనే అధికారులు వెళ్ళదీస్తున్నారు.
శాశ్వతంగా వరద ముంపు లేకుండా కట్టడికి చర్యలు
కామారెడ్డి జిల్లా కేంద్రంలో శాశ్వతంగా వరద ముంపు లేకుండా కట్టడి చేసేందుకు మున్సిపల్ అధికారులు, పట్టణ ప్రణాళిక శాఖ అధికారి గిరిధర్, మున్సిపల్ కమిషనర్ రాజేందర్ రెడ్డి లు తమ సిబ్బందితో నివేదికలు తయారు చేస్తున్నారు.
ఏ ఏ ప్రాంతాల్లో వరద ముప్పు
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని జి.ఆర్ కాలనీ, హౌసింగ్ బోర్డ్ కాలనీ, విద్యానగర్, బతుకమ్మ కుంట, అయ్యప్ప నగర్, గాంధీనగర్, టీచర్స్ కాలనీ, కల్కి నగర్, నిజాంసాగర్ రోడ్డు, జీవధాన్ హై స్కూల్ రోడ్డు, ప్రాంతాలను వరద ముంపు ప్రాంతాలుగా మున్సిపల్ అధికారులు గుర్తించారు. ఆయా ప్రాంతాల్లో మురికి కాలువల నిర్మాణం, కల్వర్టుల నిర్మాణం, ప్రహరి గోడల నిర్మాణం, కామారెడ్డి వాగు చుట్టూ వరద తాకిడి కి కోతకు గురి కాకుండా ప్రహరీ నిర్మించడం, వంటి పనుల ను గుర్తించారు. ఒక్కోచోట కిలోమీటర్ల దూరం పనులు చేపట్టాల్సి ఉంది.
100 కోట్లు నిధులు వస్తేనే వరద తాకిడి కట్టడి
కామారెడ్డి జిల్లా కేంద్రంలో భారీ వర్షాలు కురిస్తే ముంపుకు గురవుతున్న కాలనీల లో మురికి కాలువలు, కల్వర్టులు, ప్రహరీ గోడలు నిర్మాణానికి 100 కోట్ల నిధులు కామారెడ్డికి వస్తేనే పనులు చేపడితే వరద కట్టడి చేయవచ్చని మున్సిపల్ అధికారులు పేర్కొంటున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రతిపాదనలు తయారుచేసి నివేదిక పంపిస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ రాజేందర్ రెడ్డి విజయ క్రాంతి ప్రతినిధితో తెలిపారు. నిధులు వస్తే వరద కట్టడి చేయవచ్చని పనులు త్వరగా చేపడతామని అన్నారు. ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయిస్తే కామారెడ్డి లో వరద కట్టడి చేయించవచ్చని తెలిపారు.