13 May, 2026 | 1:30 AM

భక్తజన సందోహం కొండగట్టు

13-05-2026 12:00 AM

ఘనంగా పెద్దహనుమాన్ జయంతి 

జగిత్యాల, మే 12 (విజయక్రాంతి): జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో మూడు రోజుల పాటు అత్యం త వైభవంగా నిర్వహించిన పెద్ద హనుమాన్ జయంతి ఉత్సవాలు మంగళవారం ఘనం గా ముగిశాయి. వేలాది మంది భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంగళవారం తెల్లవారుజామునే తిరుమంజన కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ద్రావిడ ప్రబంధ పారాయణాలు, విశేష అభిషేకాలు, తులసీ అర్చన, పట్టు వస్త్రాల అలంకరణ, సహస్రనాగవల్లి అర్చనలు వైభవంగా నిర్వహించా రు. అనంతరం హోమం, మహాపూర్ణాహుతి, స్నపన తిరుమంజనం, ఉయ్యాల సేవ కార్యక్రమాలు నిర్వహించగా వేలాది మంది భక్తు లు పాల్గొన్నారు.

సామూహిక భజనలు, మంత్రపుష్పం, మహానివేదనం అనంతరం తీర్థప్రసాదాలను భక్తులకు అందజేశారు. సాయంత్రం ఆరాధన కార్యక్రమాలతోపాటు సామూహిక విష్ణు సహస్రనామ పారాయణం, అమ్మవారి కుంకుమార్చన, ఓడిబి య్యం, సహస్ర దీపాలంకరణ, గరుడవాహన సేవ, కంకణోద్వాసన కార్యక్రమాలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణరావు, ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.