ముమ్మాటికీ కేంద్ర ప్రభుత్వ వైఫల్యమే : ఏఐఎస్‌ఎఫ్
13-05-2026 12:00 AM
హైదరాబాద్, మే 12 (విజయక్రాంతి): నీట్ పరీక్ష పేపర్ లీక్ ముమ్మాటికీ కేంద్ర ప్రభుత్వ వైఫల్యమేనని, దీనిపై సమగ్ర విచారణ చేయించాలని ఏఐఎస్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠరెడ్డి, కార్యదర్శి పుట్ట లక్ష్మణ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటనను విడుదల చేశారు.
విద్యార్థుల జీవితాలలో ఎన్టీఏ అధికారులు చెలగాటం ఆడుతున్నారని పేర్కొన్నారు. రాష్ట్రాల స్వయం ప్రతిపత్తిని దెబ్బతీసే నీట్ పరీక్షను రద్దు చేయాలని దక్షిణాది ముఖ్యమంత్రులు చెప్పినా వారి మాటలను కేంద్రం పెడచెవిన పెడుతుందన్నారు. పేపర్ లీకేజీపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.






