calender_icon.png 25 October, 2025 | 4:09 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కొండపోచమ్మ 24వ వార్షికోత్సవ పత్రికావిష్కరణ

25-10-2025 12:00:00 AM

జగదేవపూర్, అక్టోబర్ 24: జగదేవపూర్ మండల పరిధిలోని తిగుల్ నర్సాపూర్ గ్రామంలో కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంలా అశేష భక్త జనా పూజలు అందుకుంటున్న శ్రీ కొండపోచమ్మ అమ్మవారి ఆలయ 24వ వార్షికోత్సవం నవంబర్ 10వ తేదీ నుండి 12వ తేదీ వరకు జరుగుతాయని సిద్దిపేట జిల్లా దేవాదాయ శాఖ డివిజనల్ ఇన్స్పెక్టర్ విజయలక్ష్మి, ఆలయ ఈవో రవికుమార్, చైర్మన్ అనుగీత హరిప్రసాద్ రావు ఆధ్వర్యంలో శుక్రవారం ఆలయ ప్రాంగణంలో పత్రిక ఆవిష్కరణ చేశారు.

ఈ సందర్బంగా ఛైర్మెన్ అనుగీత మాట్లాడుతూ అమ్మవారి వార్షికోత్సవం అంగరంగ జరుపడానికి అన్ని ఏర్పాట్లు చేసి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా చూస్తాం అని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు రమేష్,తిరుపతి, లక్ష్మణ్ ఆలయ సిబ్బంది కనకయ్య మహేందర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి , హరిబాబు, సుధాకర్ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.