25-10-2025 03:01:21 PM
తుంగతుర్తి మాజీ శాసనసభ్యులు డాక్టర్ గాదరి కిషోర్ కుమార్
తుంగతుర్తి,(విజయక్రాంతి): జూబ్లీహిల్స్ ఉపఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి సునీత గోపినాథ్(Maganti Sunita Gopinath) మద్దతుగా బోరబండ డివిజన్లోని క్లస్టర్-1 రాజ్ నగర్ కాలనీలోని 357,358,359,360,361బూత్ లలో బిఆర్ఎస్ గెలుపు కోసం ఇంటింటి ప్రచారం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే డా.గాదరి కిశోర్ కుమార్ మాట్లాడుతూ జూబ్లీహిల్స్ ప్రజలు కాంగ్రెస్ పార్టీ మాయమాటలను నమ్మరని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీలన్నీ వట్టి మూటలు అని ఎద్దేవా చేశారు. మాగంటి సునీత గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు గుజ్జ యుగంధర్ రావు , నేవూరి ధర్మేందర్ రెడ్డి మాజీ జెడ్పిటిసి వెంకన్న, స్థానిక నాయకులు, తుంగతుర్తి నియోజకవర్గ నాయకులు పాల్గొన్నారు.