calender_icon.png 25 October, 2025 | 5:54 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆధ్యాత్మిక క్షేత్రంగా దేవుని గుట్ట

25-10-2025 03:35:55 PM

మహబూబ్ నగర్ టౌన్:  నగరంలోని దేవుని గుట్ట ఆధ్యాత్మిక క్షేత్రంగా అభివృద్ధి చెందుతుందని మంత్రి వాకిటి శ్రీహరి, మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శనివారం మహబూబ్ నగర్ నగరంలోని దేవుని గుట్ట పైన గౌడ కులస్తుల ఆరాధ్య దైవం శ్రీశ్రీశ్రీ కంఠ మహేశ్వర స్వామి విగ్రహా ప్రతిష్ట మహోత్సవానికి మంత్రి వాకిటి శ్రీహరి,ఎమ్మెల్యే  ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ గౌడ కులస్తులు తమ కుల దైవం శ్రీశ్రీశ్రీ కంఠ మహేశ్వర స్వామి వారికి ప్రత్యేక  దేవాలయం నిర్మాణం చేయడం జరిగిందని, ఇక్కడ వివిధ దేవతామూర్తుల విగ్రహాలు కూడా ఏర్పాటు చేశారు.

నగరంలోని ప్రజలంతా దేవాలయాన్ని సందర్శించి శ్రీ శ్రీ శ్రీ కంఠ మహేశ్వర స్వామి వారిని దర్శించుకోవాలన్నారు.   శ్రీ శ్రీ శ్రీ కంఠ మహేశ్వర స్వామి వారు మహబూబ్ నగర్ ప్రజలను  కంటికి రెప్పలా కాపాడాలని స్వామి వారి అనుగ్రహం ప్రజలపైన ఎల్లవేళలా ఉండాలని ఆకాంక్షించారు.   అంతకుముందు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో ఘనంగా స్వాగతం పలికారు.  అనంతరం వేద పండితులు వేద ఆశీర్వాదం అందించి తీర్థ ప్రసాదాలు అందజేశారు.