calender_icon.png 26 October, 2025 | 12:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హైడ్రా పనితీరు అద్భుతం

25-10-2025 12:00:00 AM

  1. ప్రశంసించిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్  

మంగళగిరి క్యాంప్ కార్యాలయంలో కలిసిన హైడ్రా కమిషనర్

హైదరాబాద్ సిటీ బ్యూరో,అక్టోబర్ 24 (విజయక్రాంతి): హైదరాబాద్‌లో చెరువులు, ప్రభుత్వ భూముల పరిరక్షణకు ఏర్పాటు చేసిన హైడ్రా పనితీరుపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రశంసల వర్షం కురిపించారు. ఏపీలో కూడా ఇలాం టి వ్యవస్థ అత్యవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. శుక్రవారం విజయవాడలో హై డ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో పవన్ కల్యా ణ్‌తో  మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు.

ఈ సందర్భంగా హైదరాబాద్‌లో చెరువులు, నాలాల పరిరక్షణ, అక్రమ కట్టడాల తొలగింపు వంటి అంశాల్లో హైడ్రా అనుసరి స్తున్న విధానాలను పవన్ కల్యాణ్ అడిగి తెలుసుకున్నారు.

హైడ్రా పనితీరును కొనియాడిన ఆయన, ఏపీలోనూ అక్రమాలను అరికట్టేందుకు ఇలాంటి సంస్థను ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలిస్తామని సూచనప్రాయంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో రియర్ అడ్మిరల్ ఆర్. శ్రీనివాసరావు, మేజ ర్ ఎస్పిఎస్ ఓబెరాయ్, ఐసీసీడీఆర్ సెక్రటరీ జనరల్ డా. శ్రీనివాస్ ఎలూరి తదితరులు పాల్గొన్నారు.