25-10-2025 03:32:27 PM
అన్ని జిల్లాలలో కోల్డ్ స్టోరేజ్ ఇలా ఏర్పాటు
ఇబ్రహీంబాద్ హేమ సముద్రం చెరువులో చేప పిల్లలు వదలిన మంత్రి వాకిటి శ్రీహరి, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి
హన్వాడ: ఎదగాలని సంకల్పానికి ప్రభుత్వం చేయూతని అందిస్తూ ఉన్నత శిఖరాలకు చేర్చుతుందని రాష్ట్రం లో మత్స్య పరిశ్రమ పై ఆధారపడ్డ మత్స్యకారుల ఆర్థిక అభివృద్ధి, ఉపాధికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర పశు సంవర్ధక, మత్స్య,డైరీ అబివృద్ధి, క్రీడలు, యువజన శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. మత్స్యకారులకు 100 శాతం రాయితీతో చేపలు పంపిణీ కార్యక్రమాన్ని శనివారం మహబూబ్ నగర్ నియోజకవర్గం, హన్వాడ మండలం, ఇబ్రహీం బాద్ లోని హేమ సముద్రం దగ్గర మత్స్యశాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి, జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి తో కలిసి మంత్రి ముఖ్య అతిథిగా హాజరై హేమ సముద్రంలో ఒక లక్ష 80 వేల చేపలు పిల్లలు పంపిణీ కార్యక్రమం ప్రారంభించారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూతెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాలో చేపలు నిల్వ చేయడానికి కోల్డ్ స్టోరేజ్ లు ఏర్పాటుకు డి.పి.ఆర్. రూపొందించనున్నట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో గోదావరి, కృష్ణ నదుల మధ్యన ఉన్న అన్ని చెరువులలో ఎన్నడూ లేనివిధంగా రూ 94 కోట్ల తో 84 కోట్ల చేప పిల్లలను సుమారు 26 వేల చెరువుల్లో, రూ 29 కోట్ల తో రూ 10 కోట్ల రోయ్యలను 300 నీటి వనరుల్లో విడుస్తున్నామని చెప్పారు.
రాష్ట్ర క్యాబినెట్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే మత్స్య శాఖకు బడ్జెట్ పెంచాలని కోరడం జరిగిందని, మార్చి నెలలో కేటాయించే బడ్జెట్ మళ్లీ వచ్చే మార్చిలో కేటాయింపులు జరుగుతాయని,కాని మంత్రిగా కోరిన వెంటనే 123 కోట్ల కేటాయింపు చేసినట్లు తెలిపారు.రాష్ట్రం లో మత్స్య రంగం పై ఆధారపడ్డ 5 లక్షల మత్స్యకారులు,మత్స్య సహకార సంఘాల సభ్యులకు ఆర్థికంగా అభివృద్ధి,ఉపాధి కల్పించేలా ఉచిత చేప పిల్లలు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. రైతుల నుండి వడ్లను కొని బియ్యం తయారుచేసి చౌక ధర దుకాణాల ద్వారా పేదలకు కుటుంబంలో ఒక్కొక్కరికి 6 కిలోల సన్న బియ్యం పంపిణీ చేసిన విధం గానే చేపలను ఎండ బెట్టి పౌడర్ తయారీ చేసి పాఠశాలల పిల్లలకు ఆరోగ్యంగా ఉండేలా సరఫరాకు ఆలోచన చేసి అధ్యయనం చేస్తున్నట్లు తెలిపారు.
గతంలో చిన్న సైజు చేపలు పంపిణీ చేసే వారని అన్నారు.పారదర్శకంగా చెరువు వద్ద చేపల సంఖ్య,ఖర్చు,మత్స్య సహకార సంఘం,ఎస్. ఐ పేర్లు,ఫోన్ నంబర్ లతో బోర్డ్ లు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. పిల్లలు,రొయ్యంపిల్లలు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. మత్స్య కార సహకార సంఘాల్లో మత్స్యకారులకు సభ్యత్వం కల్పిస్తామని అన్నారు. మత్స్య కారులకు చేపల విక్రయానికి 60 మొబైల్ వాహనాలు పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు.
మన ఆత్మ బంధువు మంత్రి వాకిటి శ్రీహరి: ఎమ్మెల్యే
మన ఆత్మబంధువు క్యాబినెట్ లో ఉన్నారని, మన సమస్యలు ఏవి ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని ఒప్పించి సాధించే వ్యక్తి మన మంత్రి శ్రీహరి అని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. సర్పంచ్ నుంచి అంచెలంచెలుగా ఎదిగి నేడు రాష్ట్ర మంత్రిగా ఉన్న వాకిటి శ్రీహరి కి కొన్ని కోట్ల మంది భవిష్యత్తును తీర్చిదిద్దే బాధ్యత ను రాష్ట్ర ముఖ్యమంత్రి అప్పజెప్పారని అన్నారు. కోల్డ్ స్టోరేజ్ పాయింట్ లేనందువల్ల మత్స్యకారులు ఇబ్బందులు పడుతున్నారని, చేపలు నిల్వ చేయడానికి కోల్డ్ స్టోరేజ్ పాయింట్ ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే మంత్రి ని కోరారు. మత్స్యకారులు ఆర్థికంగా ఎదిగేందుకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారరు.