25-10-2025 02:59:33 PM
మరిపెడ,(విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా తెలంగాణ మోడల్ స్కూల్, మరిపెడలో ఇంగ్లీషు బోధన చేస్తున్న శ్రీ సోన్‌బోన్ ఆంథని డిసౌజా అమెరికా లోని నార్త్ కరోలైనా యూనివర్శిటీ, గ్రీన్‌స్బొరోలో నిర్వహించిన ఫుల్‌బ్రైట్ టీచింగ్(Fulbright training ) ఎక్సలెన్స్ అండ్ అచీవ్‌మెంట్ (ఎఫ్ టిఏ) కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేశారు.భారతదేశం నుండి ఎంపికైన కేవలం ఏడు మంది ఉపాధ్యాయుల్లో శ్రీ డిసౌజా ఒకరు. ఈ ఆరు వారాల శిక్షణ కార్యక్రమం సెప్టెంబర్ 10 నుంచి అక్టోబర్ 27, 2025 వరకు జరిగింది. ఇందులో 130 గంటల అకడమిక్ శిక్షణ, 40 గంటల ఫీల్డ్ అనుభవం, 40 గంటల సివిక్స్ మరియు సాంస్కృతిక కార్యకలాపాలు ఉన్నాయి.శిక్షణ అనంతరం ఆయనకు అమెరికా విదేశాంగ శాఖకు చెందిన బ్యూరో ఆఫ్ ఎడ్యుకేషనల్ అండ్ కల్చరల్ అఫైర్స్ మరియు ఫుల్బ్రైట్ ఫారిన్ స్కాలర్‌షిప్ బోర్డు నుండి సర్టిఫికెట్ అందజేయబడింది.ఈ సాధనతో శ్రీ డిసౌజా తెలంగాణ విద్యావ్యవస్థకు గర్వకారణమయ్యారు