25-10-2025 03:40:50 PM
ధర్మపురి,(విజయక్రాంతి): జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం జగదేవ్ పేట గ్రామానికి చెందిన నూకల నర్సవ్వ-మల్లయ్య కుటుంబం వాళ్ల ఇంటికి వెళ్ళడానికి ఉన్న రోడ్డు ను కొర్రి గంగయ్య కుటుంబం కబ్జా చేసారంటూ కలెక్టర్ కార్యాలయం ఎదుట వంటా వార్పుతో నిరసన వ్యక్తం చేశారు. కొర్రి గంగయ్య కుటుంబానికి ఇందిరమ్మ ఇళ్ల స్థలలు రాగా పక్కనే ఉన్న మా ఇంటికి అది కూడా పట్టా భూమిలోకి వెళ్లే రోడ్డు కబ్జాచేసారని వృద్ధ దంపతులు ఆవేదన వ్యక్తం చేశారు. గత రెండు సంవత్సరాలుగా అధికారుల చుట్టూ తిరిగుతున్న పట్టించుకోవడం లేదని కన్నీటి పర్యాంతం అయ్యారు. హైదరాబాద్ లో ప్రజా ధర్బార్ లో సైతం పిర్యాదు చేసిన అధికారులు పట్టించుకోవడం లేదనీ అన్నారు. సమస్యను పట్టించుకోకాపోగా బెదిరింపులకు గురిచేస్తున్నారనీ బాధితులు వాపోయారు.