calender_icon.png 14 July, 2025 | 12:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కోట శ్రీనివాసరావుకు కన్నీటి వీడ్కోలు

13-07-2025 04:49:09 PM

హైదరాబాద్: ప్రముఖ సినీ నటుడు కోట శ్రీనివాసరావు అంత్యక్రియలు పూర్తయ్యాయి. తెలంగాణ ప్రభుత్వ అధికార లాంఛనాలతో జూబ్లీహిల్స్ లోని మహాప్రస్థానంలో కోట శ్రీనివాసరావుకు అశ్రునయనాలతో తుది వీడ్కోలు పలికారు. అంతకుముందు ఫిల్మ్ నగర్ లోని ఆయన ఇంటి నుంచి జూబ్లీహిల్స్ లోని మహాప్రస్థానం వరకు అంతిమయాత్ర కొనసాగింది. కోట శ్రీనివాసరావుకు తుది విడ్కోలు పలికేందుకు పెద్ద ఎత్తున సినీ, రాజకీయ ప్రముఖులు, అభిమానులు తరలివచ్చారు. గత కొంతకాలంగా దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆదివారం తెల్లవారుజామున 4 గంటలకు కన్నుమూసిన విషయం తెలిసిందే.