calender_icon.png 14 July, 2025 | 1:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రేషన్ కార్డుల కోసం దశాబ్ద కాలం ఎదురుచూపులకు తెర

13-07-2025 04:51:06 PM

ఈనెల 14 నుండి రేషన్ కార్డులను అందించనున్న కాంగ్రెస్ ప్రభుత్వం..

వలిగొండ (విజయక్రాంతి): దశాబ్ద కాలంగా తెలంగాణ రాష్ట్రంలో నిరుపేదలు నూతన రేషన్ కార్డుల కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూడగా ఎట్టకేలకు కాంగ్రెస్ ప్రభుత్వం నూతన రేషన్ కార్డులను ఈనెల 14 నుండి లబ్ధిదారులకు అందించేందుకు శ్రీకారం చుట్టింది. గత ప్రభుత్వం రెండు పర్యాయాలు అధికారంలో ఉన్నప్పటికీ నూతన రేషన్ కార్డులను, రేషన్ కార్డులలో కుటుంబ సభ్యుల చేర్పులను చేయలేదు. దీంతో ఎంతోమంది అసంతృప్తి వ్యక్తం చేస్తూ వచ్చారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం నూతన రేషన్ కార్డులను, కుటుంబ సభ్యుల చేర్పులకు అవకాశం ఇవ్వడంతో లబ్ధిదారులు కాంగ్రెస్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ హర్షం వ్యక్తం చేస్తున్నారు.

భువనగిరి నియోజకవర్గంలోని వలిగొండ మండలంలో ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి(MLA Kumbam Anil Kumar Reddy) చొరవతో నూతనంగా నాలుగు వేలకు పైగా రేషన్ కార్డులను కొత్తగా మంజూరు చేయించడం జరిగింది. గతంలో 15 వేలకు పైగా రేషన్ కార్డులు ఉండగా తాజాగా రేషన్ కార్డులు దాదాపు 20 వేలకు చేరుకోవడంతో నూతన రేషన్ కార్డుల లబ్ధిదారులు, కుటుంబ సభ్యుల పేర్లు నమోదు చేయించుకున్న లబ్ధిదారులు సీఎం రేవంత్ రెడ్డికి, ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు.