13-07-2025 04:46:14 PM
వలిగొండ (విజయక్రాంతి): వలిగొండ మండలం(Valigonda Mandal)లోని వెంకటాపురం గ్రామంలో వరుణుడు కరుణించి వర్షం కురిపించాలని కోరుతూ గ్రామ మహిళలు గ్రామదేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామదేవతలకు మహిళలు నీళ్లు సమర్పించి బతుకమ్మ పాటలు పాడుతూ ఆటలు ఆడారు. వర్షాకాలం ప్రారంభమైనప్పటికీ నేటికీ వర్షాలు కురవకపోవడం వల్ల విత్తనాలు మొలకెత్తడం లేదని మొలకెత్తిన విత్తనాలు ఎండిపోతున్నాయని వరి నారులు కూడా ఎండకు నిండిపోయే పరిస్థితి వచ్చిందని రైతులు ఆవేదన చెందుతున్నారు. అందుకే వరుణుడు కరుణించి వర్షాలు కురిపించాలని గ్రామ దేవతలకు పూజలు నిర్వహించడం జరిగిందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, ప్రజలు పాల్గొన్నారు.