14-07-2025 12:00:32 AM
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్
పాపన్నపేట, జూలై 13: రైతులకు ఎరువులు సకాలంలో అందేలా పటిష్ట చర్యలు చేపట్టామని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. ఆదివారం జిల్లా కలెక్టర్ పాపన్నపేట మండలం లక్ష్మీనగరం గ్రామంలో ఎరువులు, పురుగు మందుల దుకాణాన్ని కలెక్టర్ పరిశీలించారు. యూరియా, కాంప్లెక్స్ ఎరువుల నిల్వ, అమ్మకాలు ఈ పాస్ యంత్రంలో నమోదు వివరాలు, దుకాణం, గోదాంలోని ఎరువులు, పురుగు మందుల నిల్వలను పరిశీలించారు.
ప్రస్తుతం యూరియా, కాంప్లెక్స్ ఎరువులు, పొటాష్ అందుబాటులో ఉన్నట్లు, యూరియాకు ఎలాంటి ఇబ్బంది లేదని కలెక్టర్ తెలిపారు. రైతు సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. జిల్లా మొత్తంలో 4675.89 మెట్రిక్ టన్నుల యూరియా నిల్వలు ఉన్నాయన్నారు. మండలంలోని వివిధ గ్రామాలను, ఎరువుల విక్రయ కేంద్రాలకు మ్యాపింగ్ చేయాలని, వ్యవసాయ సిబ్బందిని ఆదేశించినారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
మెదక్, జులై 13(విజయ క్రాంతి): రైతులు పంటల యాజమాన్య పద్ధతులు పాటించాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. ఆదివారం మెదక్ మండలం పేరూరు గ్రామంలో రైతుల పంట పొలాలను క్షేత్రస్థాయిలో కలెక్టర్ పరిశీలించారు. రైతులతో కలెక్టర్ నేరుగా మాట్లాడుతూ నిరంతర విద్యుత్ సరఫరా గురించి, యూరియా ఇతర పురుగు మందుల సరఫరా గురించి రైతులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.