calender_icon.png 6 September, 2025 | 9:13 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పల్లె రహదారుల అభివృద్ధిలో కొత్తగూడెం నియోజకవర్గం ఆదర్శం

06-09-2025 06:42:25 PM

భద్రాద్రికొత్తగూడెం,(విజయక్రాంతి): పల్లె రహదారులను అభివృద్ధి చేయడంలో ప్రజలకు కనీస మౌలిక వసతుల కల్పనలో కొత్తగూడెం నియోజకవర్గం ఆదర్శమని, వివిధ పథకాలలో మంజూరైన నిధులతో ఇప్పటికే గ్రామీణ అనుసంధాన రోడ్లు, ప్రధాన రహదారులు పూర్తిచేశామని కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు అన్నారు. జర్నలిస్టు డే సందర్బంగా శనివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కేక్ కట్ చేసిన అనంతరం, పాత్రికేయులను శాలువాలతో సన్మానించారు. అనంతరం జరిగిన విలేకర్ల సమావేశంలో అయన మాట్లాడుతూ గ్రామీణ రహదారులు, పట్టణ అంతర్గత రహదారులు, వంతెనల నిర్మాణంపై ప్రత్యేక ద్రుష్టి సారించామని తెలిపారు.

గిరిజన సంక్షేమ శాఖా ద్వారా నియోజకవర్గంలో ఐదు హైలెవల్ వంతెనలు, 5.90కిలోమీటర్ల మేర రోడ్ల నిర్మాణానికి పరిపాలనా అనుమతులు లభించాయని, ఇందుకోసం రూ.16.05కోట్ల నిధులు మంజూరయ్యాని తెలిపారు. ఈ నిధులతో లక్ష్మీదేవిపల్లి మండల పరిధిలోని పెద్దతండా-మాన్యతండా మధ్య రూ.1.80కోట్ల వైతం హైలెవల్ వంతెన, హేమచంద్రాపురం-అనిశెట్టిపల్లి వరకు రెండు కిలోమీటర్ల మేర బిటి రోడ్డు, హైలెవల్ బ్రిడ్జి నిర్మాణం, చుంచుపల్లి-చిట్టిరామవరం వరకు 2.70కిలోమీటర్ల మేర బిటి రోడ్డు, హైలెవల్ వంతెన, పాతకొత్తగూడెం బైపాస్-పెనుబల్లి మధ్య హైలెవల్ వంతెన, సుజాతనగర్ మండల పరిధిలోని సీతంపేట-అంజనాపురం వరకు 1.20బిటి రోడ్డు, హైలెవల్ వంతెన వంతెన నిర్మాణం చేపడతామని, త్వరలో పనులు ప్రారంభించి ప్రజలకు అందుబాటులోకి తెస్తామని తెలిపారు.