06-09-2025 06:37:05 PM
నిజాంసాగర్,(విజయక్రాంతి): ఉమ్మడి నిజాంసాగర్ మండలంలోని అన్ని గ్రామాలకు సంబంధించిన కల్యాణ లక్ష్మి, షాది ముబారక్, ముఖ్యమంత్రి సహాయక చెక్కులను, శనివారం నిజాంసాగర్ మండల కేంద్రంలో జుక్కల్ శాసనసభ్యులు తోట లక్ష్మీకాంతరావు పంపిణీ చేశారు. తమ ప్రభుత్వం పేద ప్రజలకు ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.