06-09-2025 06:45:08 PM
పటాన్చెరు(విజయక్రాంతి): సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం పరిధిలోని పటాన్చెరు డివిజన్ పారిశ్రామిక వాడలోని శ్రీ సాయిబాబా సెల్యులోజ్ పరిశ్రమలో శుక్రవారం ఘోర ప్రమాదం జరిగింది. 50 ఏళ్ల కార్మికుడు అమర్ సింగ్ యంత్రంలో పడి తీవ్ర గాయాలపాలయ్యాడు. ఈ ఘటనలో ఆయన కుడి చేయి పూర్తిగా నశించింది. గాయపడిన కార్మికుడిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే, ప్రమాదానికి బాధ్యత వహిస్తూ కంపెనీ యాజమాన్యం తగిన నష్టపరిహారం చెల్లించాలని బాధితుడి కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. కంపెనీ ముందు ధర్నాకు దిగిన బంధువులు, సంఘటనపై ఆగ్రహం వ్యక్తం చేశారు.