16-08-2025 05:39:55 PM
నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ పట్టణంలోని బుధవార్పేట్ శిశు మందిర్ లో శనివారం శ్రీ కృష్ణాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. చిన్నారి విద్యార్థులు శ్రీకృష్ణుని గొల్లభాముల వేషధారణ ధరించి ముత్యాలు చేస్తూ కోలాటం చేశారు. ఈ కార్యక్రమంలో నిర్వాకులు పండరి పాఠశాల ప్రిన్సిపాల్ నరేష్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.