calender_icon.png 17 August, 2025 | 1:04 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యాదవ రెజిమెంట్ పునస్థాపన అమలు చేయాలి

16-08-2025 05:38:42 PM

నంగునూరు: భారత సైన్యంలో అహిర్(యాదవ) రెజిమెంట్ను ఏర్పాటు చేయాలని అఖిల భారత యాదవ మహాసభ డిమాండ్ చేస్తోంది. 1962 నాటి చైనా యుద్ధంలో రేజాంగ్ లా ప్రాంతంలో వీరమరణం పొందిన 114 మంది యాదవ సైనికుల త్యాగాలకు సరైన గుర్తింపు లభించలేదని నంగునూరు మండల(Nanganur Mandal) యాదవ సంఘం అధ్యక్షులు వడితం కిరణ్ కుమార్ యాదవ్ అన్నారు. ఈ మేరకు నంగునూరులో జరిగిన రేజాంగ్ లా శౌర్య యాత్ర కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అఖిల భారత యాదవ మహాసభ ఆధ్వర్యంలో రేజాంగ్ లా శౌర్య యాత్ర 2025 ఏప్రిల్ 13న బీహార్ రాష్ట్రంలోని చాప్రా జిల్లా నుండి ప్రారంభమైందని తెలిపారు.

1962 నాటి భారత్-చైనా యుద్ధంలో అమరులైన 114 మంది యాదవ యోధుల జ్ఞాపకార్థం ఈ యాత్ర కొనసాగుతోందని వివరించారు. ఈ యాత్ర బీహార్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి, కర్ణాటక, తెలంగాణ, మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తర ప్రదేశ్, హర్యానా రాష్ట్రాల మీదుగా సాగి, నవంబర్ 18న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ముగుస్తుందని ఆయన చెప్పారు.ఈ కార్యక్రమంలో గుండెలి రాజయ్య యాదవ్, వర్దోల్ వేణుచక్రవర్తి యాదవ్, ఎల్పుల ఐలయ్య యాదవ్, బొల్లు తిరుపతి యాదవ్, చెలికాని మల్లేశం యాదవ్, పరశురాములు యాదవ్, ఆంజనేయులు యాదవ్, మల్లేశం యాదవ్, వెంకటేష్ యాదవ్, శ్రీనివాస్ యాదవ్, వివిధ గ్రామాల యాదవ కుల బంధువులు పాల్గొన్నారు.