16-08-2025 05:41:35 PM
భద్రకాళి దేవాలయానికి బస్సు సౌకర్యం..
వరంగల్ (విజయక్రాంతి): ఓరుగల్లు నగరంలో ప్రఖ్యాతిగాంచిన భద్రకాళి భక్తులకు ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించింది. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి(MLA Naini Rajender Reddy), దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ(Minister Konda Surekha) ఆదేశముల మేరకు భద్రకాళీ అమ్మవారి దర్శనమునకు విచ్చేయు భక్తుల సౌకర్యార్థం వరంగల్ రైల్వే స్టేషన్ నుండి వయా భద్రకాళీ దేవస్థానం మీదుగా కాజీపేట రైల్వే స్టేషన్ వరకు టి.ఎస్.ఆర్.టి.సి బస్సు ప్రారంభించడానికి చర్యలు చేపట్టింది. ఈ మేరకు శనివారం కొత్త బస్సు సర్వీస్ ను ఉదయం లాంఛనంగా టి.పి.సి.సి వైస్ ప్రెసిడెంట్ బత్తిని శ్రీనివాస్ రావు జెండా ఊపి ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో కార్పోరేటర్ దేవరకొండ విజయలక్ష్మి సురేందర్, దేవాలయ చైర్మన్ డాక్టర్ బి. శివసుబ్రహ్మణ్యం, ధర్మకర్తలు తొనుపునూరి వీరన్న, గాదె శ్రవణ్ కుమార్ రెడ్డి, గాండ్ల స్రవంతి, మోతుకూరి మయూరి రామేశ్వర్రావు, ఓరుగంటి పూర్ణచందర్, బింగి సతీష్, దేవాలయ ఈవో రామల సునీత, అర్చకుడు భద్రకాళి శేషు, దేవాలయ అర్చకులు సిబ్బంది, ఆర్.టి.సి హనుమకొండ డిపో మేనేజరు ధరమ్ సింగ్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
-రామల సునీత
కార్యనిర్వహణాధికారి/సహాయ కమీషనర్, శ్రీ భద్రకాళి దేవస్థానం, వరంగల్